BigTV English

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…



Director Nag Ashwin Request to PM Modi: కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ స్లాబ్లను సవరించిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రధాన మంత్రి జీఎస్టీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. క్రమంలో ఇటీవల జీఎస్టీ స్లాబ్లను సవరించి.. కొత్త జీఎస్టీని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ప్రకటించారు. కొత్త రేట్స్సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే జీఎస్టీలో మార్పులతో మూవీ టికెట్ల రేట్స్‌, పాప్కార్న్‌, కూల్డ్రింక్స్ రేట్స్పై ప్రభావం చూపాయి.

భారీగా తగ్గిన టికెట్ రేట్స్

ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల విషయంతో జీఎస్టీ కౌన్సిల్మాత్రం మూవీ లవర్స్కి శుభవార్త అందించింది. రూ. 100 లోపు ఉన్న సినిమా టికెట్రేట్లపై జీఎస్టీ శాతాన్ని భారీగా తగ్గించారు గతంలో వందలోపు ఉన్న టికెట్పై 12 శాతం జీఎస్టీ పడేది. కానీ, కొత్త సవరణతో వందలోపు ఉన్న టికెట్పై 5 శాతానికి తగ్గించారు. కొత్త జీఎస్టీతో చిన్న సినిమా నిర్మాతలంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ. 100 పైన ఉన్న టికెట్స్‌ 18 శాతం జీఎస్టీనే వర్థిస్తుంది. ఈ విషయమై తాజాగా కల్కి డైరెక్టర్నాగ్అశ్విన్ప్రధాని నరేంద్ర మోదీకి రిక్వెస్ట్చేశారు

ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్..

జీఎస్టీని తగ్గిస్తున్నట్టు మోదీ చేసిన ట్వీట్పై నాగ్అశ్విన్స్పందిస్తూ రిక్వెస్ట్పెట్టారుకొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు స్వాగతించదగినవి సర్‌. కానీ, సినిమా టికెట్లపై ఉన్న 5 శాతం ఉన్న స్లాబ్లను రూ. 250 వరకు ఉన్న టికెట్లకు కూడా వర్తించేలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రోజుల్లో కొన్ని థియేటర్లలోనే టికెట్ధర రూ. 100 ఉంది. కానీ, చాలా వరకు థియేటర్లలో టికెట్రేట్స్రూ. 200 పైనే ఉన్నాయి. చిత్ర పరిశ్రమ, థియేటర్ల వృద్ధికి.. అలాగే మధ్య తరగతి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇది చాలా అవసరంఅంటూ నాగ్అశ్విన్తన ట్విట్లో రాసుకొచ్చారు.

Also Read: Malaika Arora: ఆ ఆస్తిని అమ్ముకున్న బాలీవుడ్‌ బ్యూటీ మలైకా.. లాభం ఎంత వచ్చిందంటే!

ప్రస్తుతం ఆయన ట్వీట్ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. ఆయన అభిప్రాయాన్ని, రిక్వెస్ట్ని ఇండస్ట్రీ వర్గాలు, థియేటర్యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. నాగ్అశ్విన్చెప్పింది సరైనదని, విషయమైన ప్రధాని ఆలోచిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా కల్కి 2898 ఏడీ సినిమాతో ఒక్కసారిగా అందరి ద్రష్టిని ఆకట్టుకున్నాడు నాగ్అశ్విన్‌. సినిమాలో ఆయన విజన్‌, పనితనానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. కల్కి కోసం ఏకంగా మూడు లోకాలను సృష్టించిన ఆయన విజన్కి హాలీవుడ్సైతం ఫిదా అయ్యింది. కల్కి చిత్రంలో నాగ్అశ్విన్పనితీరుపై దర్శకదిగ్గజాలు సైతం కొనియాడారు. ప్రస్తుతం నాగ్అశ్విన్కల్కి 2 చిత్రంతో బిజీగా ఉన్నారు. సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్వర్క్ని జరుపుకుంటుంది. త్వరలోనే సినిమాను సెట్స్పైకి తీసుకురానున్నాడు.

Tags

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×