CM Revanth Reddy: గత పాలకులు రెవెన్యూ సిబ్బందిని దొంగల్లా చూశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ సిబ్బందని పోరాట పటిమ గురించి సీఎం గుర్తు చేశారు. హైటెక్స్ లో నిర్వహించన కొలువుల పండుగ కార్యక్రమంలో జీపీవోలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు పంపిణీ చేశారు. సీఎం చేతులమీదుగా 5,106 మంది గ్రామ పాలనా అధికారులు (జీపీఓ) నియామక పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సమస్యలను కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో భూమి చుట్టే ప్రజల పోరాటాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే పోడు భూముల పంపిణీ జరిగింది.. గత పాలకులు భూములను కొల్లగొట్టేందుకే ధరిణి తెచ్చారు.. వారి పాపాలు బయటకు వస్తాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారు. ధరణి భూతాన్ని అంతం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మాట ఇచ్చినట్టుగా ధరణిని బంగాళాఖాతంలో కలిపాం. భూభారతి చట్టం అమలుకు గ్రామ పాలన అధికారులు కీలకం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: Hyderabad Metro: హైదరాబాదీలకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు
తెలంగాణలో భూ సమస్యలు పరిష్కారం కాకుండా ప్రజలను బలిపశువులను చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది పోరా పటిమను సీఎం గుర్తు చేశారు. రాష్ట్రసాధనలో ఉద్యోగులు తమవంతు పాత్ర పోషించారని అన్నారు. అలాంటి ఉద్యోగులను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని అన్నారు. రాష్ట్రంలో ధరణి ఒక భూతంగా మారి తమని పట్టి పీడిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొరివిదెయ్యం నుంచి విముక్తి కల్పించాలని రైతులు కోరుకున్నారని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీతో చర్చించి ఎన్నికల హామీల్లో ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి ప్రత్యామ్నాయంగా మరో చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
ALSO READ: PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
అధికారంలోకి వచ్చిన తర్వాత.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రిగా నియమించి ధరణి మహమ్మారిని నిర్మూలించి.. భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రప్రజలకు అంకితం చేశామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భూమితో ఎంతో అనుబంధం ఉంటుందని గుర్తు చేశారు. ధరణి వల్ల గతంలో ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఆ తర్వాత జంట హత్యలు కూడా జరిగాయని గుర్తు చేశారు. పేద రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండాలనే ఐదు వేల మందిని గ్రామ పాలన అధికారులు (జీపీవో)గా నియమిస్తున్నామని చెప్పారు.