Maniratnam: కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) ఒకరు. మణిరత్నం దర్శకత్వంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈయన కమల్ హాసన్ తో కలిసి “థగ్ లైఫ్ “(Thug Life) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 5వ తేదీ తెలుగు తమిళ హిందీ భాషలలో విడుదల అయింది.
క్షమాపణలు మాత్రమే చెప్పగలను…
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Hassan) నాయకుడు(Nayakudu) సినిమా తరువాత నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.ఇక సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ తో సినిమాకు మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ సినిమాలో మరొక నటుడు శింబు(Simbu) కూడ కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో సినిమా అద్భుతంగా ఉంటుందని అందరూ భావించారు కానీ మొదటి రోజే ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని భారీ స్థాయిలో నిర్మాతలకు నష్టాలను తీసుకువచ్చింది. ఇలా ఈ సినిమాకు నష్టాలు రావడంతో డైరెక్టర్ మణిరత్నం క్షమాపణలు(Apology) చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మరో నాయకుడు…
ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ… మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు అందరూ కూడా నాయకుడు సినిమా ఫలితాన్ని ఆశించి ఉంటారు. మా ఇద్దరి కాంబినేషన్లో మరో నాయకుడిని ఆశించిన ప్రేక్షకులకు, అభిమానులకు నేను చెప్పగలిగింది క్షమాపణలు మాత్రమే అంటూ ఈయన అందరికీ క్షమాపణలు చెప్పారు. నాయకుడు కంటే ఈ సినిమా మరింత ఉన్నతంగా ఉండాలని భావించాము తప్పా, అంతకంటే తక్కువగా ఉండాలని ఎప్పుడూ ఆలోచించలేదని, అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదని తెలిపారు. థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలోనే అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేదని, మేం ఒకటి అనుకుంటే, ప్రేక్షకులు మరొకటి ఆశించారని తెలిపారు.
భిన్నంగా కోరుకున్నారు..
ఇలా మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు చాలా విభిన్నంగా కోరుకున్నారని ఈ ఫలితం ద్వారా అర్థం చేసుకున్నాను. అయితే మీరు కోరుకున్న విధంగా సినిమాని మీ ముందుకు తీసుకురాలేని నేపథ్యంలో మీకు క్షమాపణలు మాత్రమే చెప్పగలను అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచాలనగా మారాయి. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించని నేపథ్యంలో మణిరత్నం తదుపరి ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని, ఒక అద్భుతమైన పవర్ ఫుల్ స్క్రిప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇక కమల్ హాసన్ కూడా ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో పాటు రాజకీయ వ్యవహారాలలో కూడా ఈయన ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: బిగ్ బ్రేకింగ్ – డ్రగ్స్ కేసులో హీరో శ్రీకాంత్ అరెస్ట్