BigTV English

8 Vasanthalu Success Meet: రేప్ సీన్ కోసం పంతులు.. ఈ మైండ్ సెట్ ఏంటి.. టీంపై రిపోర్టర్ సీరియస్

8 Vasanthalu Success Meet: రేప్ సీన్ కోసం పంతులు.. ఈ మైండ్ సెట్ ఏంటి.. టీంపై రిపోర్టర్ సీరియస్

8 Vasanthalu Success Meet: 8 వసంతాలు… ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది కాబట్టి అందరికీ ఒక అవగాహన ఉండే ఉంటుంది. దర్శకుడు ఫణింద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే నెగిటివ్ కామెంట్స్ ఈ సినిమా పైన మొదలయ్యాయి. దీనికి కారణం దర్శకుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమా గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మణిరత్నం సినిమాను కామెంట్ చేయడానికి వాళ్లకు ఏ అర్హత ఉంది అనే ఒక్క కామెంట్. ఆ తర్వాత నుంచి దర్శకుడుని అందరూ అర్హత స్టార్ ను చేసేశారు. ఈ సినిమాను ప్రాపర్ గా ప్రమోషన్ చేసి ఉండి ఉంటే ఈ సినిమాకి మంచి ఆదరణ లభించేది. అయితే కొంతమంది ఈ సినిమాను టార్గెట్ చేశారు అనేది ఒప్పుకోలేని వాస్తవం.


రేప్ సీన్ కోసం పంతులు 

ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో దర్శకుడు ఫణింద్ర మాట్లాడుతూ.. నాలోని రచయితను పక్కనపెట్టి ఒక పది నిమిషాలు ఆలోచిస్తే ఎలా ఉంటుందో అనడానికి నిదర్శనం ఈ సినిమాలో ఉన్న వారణాసి ఫైట్ అని చెప్పాడు. ఫణి చెప్పింది వాస్తవానికి నిజమే. చాలా అద్భుతంగా వారణాసి ఫైట్ డిజైన్ చేశాడు. అయితే ఇక్కడే అసలైన వ్యతిరేకత పుట్టుకొచ్చింది. ఆ ఫైట్ సీన్ కంటే ముందు శుద్ధి అయోధ్య అనే అమ్మాయిని ఒక అడ్రస్ కు తీసుకెళ్తాడు పంతుల రూపంలో ఉన్న పోనీటైల్ అనే ఒక క్యారెక్టర్. అక్కడ కొంతమంది ముస్లింస్ కూడా యాడ్ అవుతారు. ఇక ఆ సీన్ విషయానికి పక్కన పెడితే. రీసెంట్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ అమ్మాయిని రేప్ చేయడానికి ఒక పంతులు తీసుకెళ్తాడా అంటూ చిత్ర యూనిట్ మీద ఫైరయ్యారు. ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ మీద విరుచుకుపడ్డారు.


దర్శకుడు లేకపోవడం వలన సైలెన్స్ 

ఈ సినిమా దర్శకుడు సక్సెస్ మీట్ కు హాజరు కాలేదు. సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ ఈ ఒక్క ప్రశ్నను అడగడానికి మాత్రమే నేను ఈ సక్సెస్ మీట్ కు హాజరయ్యాను. దర్శకుడు రాలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటూ చిత్ర యూనిట్ మీద విడిచిపడ్డారు. అయితే ఈ సినిమాలో ఒక హీరోగా పని చేసిన రవి దీనికి సమాధానంగా దర్శకుడు ఈ సన్నివేశాన్ని పెట్టడానికి ఆయన దగ్గర ఒక బలమైన కారణం ఉండి ఉండొచ్చు ఆయన అయితే దీనికి మీకు సమాధానం చెబుతారు అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా ఆ సీనియర్ జర్నలిస్ట్ ను కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ విషయంలో దర్శకుడు ఫణీంద్ర ఏమైనా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.

Also Read: 8 Vasanthalu : సక్సెస్ మీట్ కు డుమ్మా కొట్టిన డైరెక్టర్, ప్లాప్ ను ఒప్పుకున్నాడా.?

Related News

NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Kangana Ranaut: క్యాస్టింగ్ కౌచ్ పై కంగనా కామెంట్స్.. అలా చేస్తేనే అవకాశం!

Betting Apps case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా..

War 2 Event : ‘వార్ 2’ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

Big Stories

×