BigTV English

Iran: అమెరికాలో విధ్వంసం సృష్టిస్తాం.. దాడికి ముందే వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

Iran: అమెరికాలో విధ్వంసం సృష్టిస్తాం.. దాడికి ముందే వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

Iran: ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై అమెరికా అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడికి ముందే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. తమ స్లీపర్ సెల్స్ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తారని.. భయ బ్రాంతులకు గురిచేస్తారని హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన వారం ట్రంప్ కెనడా జరిగిన జీ7 సదస్సులో ఉండగా.. ఓ మేడియేటర్ ద్వారా ఇరాన్ ఆయనకు చేరవేసినట్టు సమాచారం. అలాగే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.


అయితే ఈ వార్తలపై ఇరు దేశాల దౌత్య కార్యాలయాలు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ వార్తలపై జీ7 నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్ తమ దేశ భద్రతపై హడావుడిగా మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. యూరప్‌లోని అమెరికా వాసులనే లక్ష్యంగా చేసుకునే కేపబిలిటీ ఇరాన్ కు ఉందని చాలా దేశాలు విశ్వసించాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ దేశంలోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ మూడు అణు స్థావరాలపై విరుచుకుపడిన తర్వాత రోజే ఈ విషయం బయటకు వచ్చింది.

ALSO READ: Hormuz Strait: ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మోజ్ జలసంధి మూసివేత.. ఇక భారత్‌కు కష్టాలే?


ఈ క్రమంలోనే అమెరికాలోని ప్రధాన నగరాల్లోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను హైఅలర్ట్ లో ఉంచారు. యూదులపై హింస, సైబర్ అటాక్స్, అల్లర్లు జరగొద్దని ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరించింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ జోబైడెన్ హయాంలో ఓపెన్ బోర్డర్ విధానంతో దాదాపు 1200 మంది ఇరాన్ దేశస్థులు తమ దేశంలోకి ప్రవేశించినట్టు బోర్డర్ జార్ టామ్ హూమన్ తెలిపారు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరంలో భద్రతన పెంచారు.

ALSO READ: Indian Army: ఆర్మీకి కొత్త అస్త్రాలు.. అత్యాధునిక ఆయుధాలు, ప్రత్యర్థులకు ఇక చిత్తడే

ఇజ్రాయెల్ సపోర్టు చేస్తున్నట్టు అమెరికా బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు మద్ధతుగా ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా మోస్ట్ పవర్ ఫుల్ బాంబర్లు, మిసైళ్లతో అటాక్ చేసింది. ఇరాన్ లోని మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా ప్రకటన విడుదల చేసింది. ధస్వం చేసేందుకు 14 బంకర్ బస్టర్ బాంబులను అణుకేంద్రాలపై వేసింది. అలాగే ఈ దాడి చేసేందుకు 120కి పైగా వేర్వేరు రకాల విమానాలు వాడింది.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×