Srikanth In Drugs case: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున డ్రగ్స్ (Drugs)వివాదంలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎంతోమంది డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణలకు హాజరవుతున్నారు. ఇటీవల టాలీవుడ్ ప్లే బాక్స్ సింగర్ మంగ్లీ సైతం ఇలాంటి వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. అయితే ఈ వివాదం మర్చిపోకముందే మరొక హీరో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం ఒక్కసారిగా సంచలనగా మారింది. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీ రామ్(Sri Ram) డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్టు కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీరామ్ చిన్నప్పటినుంచి సినిమాలలో నటించాలని ఎన్నో కలలు కన్నారు. ఇలా సినిమాలలోకి రావడం కోసం ఈయన చిన్నప్పుడే చిన్న వెళ్లిపోయి శ్రీకాంత్ (Sri Kanth) గా ఉన్న తన పేరును కాస్త శ్రీ రామ్ గా మార్చుకున్నారు. ఇలా సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్న పాత్రలలో నటించిన శ్రీరామ్ అనంతరం రోజా పూలు సినిమాతో హీరోగా తెలుగు, తమిళ భాష చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విధంగా హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఉన్న ఈయన ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా సందడి చేశారు.
డ్రగ్స్ కొన్న నటుడు…
ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీరామ్ ఇటీవల డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా చెన్నై పోలీసులు తనని అరెస్టు చేసి పరీక్షల నిమిత్తం తనని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలా పరీక్షలు అనంతరం నటుడు శ్రీరామ్ ను నుంగంబాకం పోలీస్ స్టేషన్ కు తరలించారు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ దాదాపు రెండు గంటల పాటు ఈయనని విచారణ చేపట్టారు. మాజీAIADMK ఐటీ విభాగానికి చెందిన నేత ప్రసాద్ తో ముడిపడిన ఈ కేసులో ఆయనతోపాటు నటుడు శ్రీరామ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈయనను అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ వ్యవహారంలో తమిళ హీరోలు…
ఈ కేసులో భాగంగా ప్రసాద్ తో పాటు మరికొంత మందిని అరెస్టు చేసి విచారిస్తున్న నేపథ్యంలో నటుడు శ్రీరామ్ పేరు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది . అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఈయనతో పాటు మరికొంతమంది తమిళ హీరోల ప్రమేయం కూడా ఉన్నట్టు సమాచారం. ఇలా డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా శ్రీరామ్ అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక ఈయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహితులు అనే సినిమాలో కీలకపాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల కాలంలో కెరియర్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకొని శ్రీరామ్ ఇలా డ్రగ్స్ కేసులు అరెస్టు కావడంతో ఇది కాస్త సంచలనగా మారింది.
Also Read: ఎవరిని కించపరచాలని మాట్లాడలేదు… వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ!