Jasprit Bumrah Rejected MI Vice-Captain: ఐపీఎల్ 2027 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను మూడేళ్ల తర్వాత ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ముంబై యాజమాన్యం వీడియో ద్వారా వెల్లడించింది. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే ముంబై ఇండియన్స్ జట్టులో ముసలం నెలకొందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ముంబై ఇండియన్స్ ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను యార్కర్ల కింగ్ బుమ్రా రిజెక్ట్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ప్రకటించిన ముంబై, బుమ్రాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. గత నెలలోనే ఈ విషయాన్ని బుమ్రాకు తెలియజేయందట. కానీ దాన్ని అతడు వదులుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్సీ దక్కే అవకాశాలున్నాయి.
2013 నుంచి ముంబై ఇండియన్స్ లో బుమ్రా కొనసాగుతున్నాడు. జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఈ తరుణంలోనే ముంబై కెప్టెన్సీని చాలా సార్లు బుమ్రా అడిగినట్టు తెలుస్తోంది. కానీ అంబానీ ఫ్యామిలీ పదే పదే రిజెక్ట్ చేసిందట. కెప్టెన్సీ ఇస్తే, బుమ్రా బౌలింగ్ రిథమ్ పోతుందని అంబానీ భావించారట. అయితే, నెల కిందట వైస్ కెప్టెన్సీ ఇస్తామని బుమ్రాకు అంబానీ ఆఫర్ ఇవ్వగా.. రిజెక్ట్ చేశాడట. తనకు కెప్టెన్సీనే కావాలని బుమ్రా డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వడంపై బుమ్రా గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబైలో మళ్లీ ముసలం మొదలైందని చర్చ నడుస్తోంది.
ఐపీఎల్ 2027 నేపథ్యంలో కెప్టెన్ విషయంలో కేకేఆర్ యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. వచ్చే సీజన్ కోసం అజింక్య రహానే స్థానంలో ఫినిషర్ రింకు సింగ్‌కే పగ్గాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వేలానికి ముందే డిసెంబర్ 3న ప్రకటన రానుందని సమాచారం. 4న రింకు సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి ఉండగా, అంతకంటే ముందు రోజే ప్రకటన చేసి అతనికి ట్రీట్ ఇవ్వాలని యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అటు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రిషబ్ పంత్ వెళ్లడంతో కెప్టెన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. పంత్ నిష్ర్కమణతో మార్ష్, పూరన్, మార్క్రమ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మార్క్రమ్ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గతంలో అక్షర్ పటేల్ కెప్టెన్‌గా కొనసాగాడు. కానీ ఈ సీజన్ నుంచి రిషబ్ పంత్‌కు బాధ్యతలు ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అతడు రిజెక్ట్ చేస్తే.. మళ్లీ అక్షరే సారథిగా కొనసాగే అవకాశం ఉంది.