Mass Jathara: అనుకున్నదే అయ్యింది.. ఫిల్మ్ ఇండస్ట్రీలో సమ్మె చాలా ఇబ్బందులకు గురిచేసింది. షూటింగ్స్ నిలిపివేయడం వలన జరగరాని అనర్ధమే జరిగింది. సమయానికి షూటింగ్స్ జరగకపోవడం వలన అనుకున్న సమయానికి సినిమాలను ఫినిష్ చేయలేక వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే మిరాయ్ వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఇది కాకుండా మరో సినిమా కూడా వాయిదా పడిందని మేకర్స్ తెలిపారు. అదే మాస్ జాతర.
మాస్ మహారాజా రవితేజ హీరోగా భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ జాతర. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాని తరువాత ఈ జంట నుంచి వస్తున్న మరో సినిమా కావడంతో మాస్ జాతరపై అంచనాలు పెరిగిపోయాయి.
ఇక మాస్ జాతర నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపైనే రవితేజ, శ్రీలీల ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వారిద్దరికీ మంచి హిట్ పడి చాలాకాలం అయ్యింది. ఇక ఈ సినిమా వాయిదాల మీద నడుస్తూ ఉన్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు ఆగస్టు 27 న మాస్ జాతరను రిలీజ్ చేయనున్నట్లు నాగవంశీ ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు.
మొదట వార్ 2విషయంలో నాగవంశీ గట్టిగా దెబ్బ తిన్నాడు. భారీ ధరకు తెలుగు రైట్స్ ను తీసుకొని కలక్షన్స్ రాక ఘోరంగా నష్టపోయాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం కావాలని, అందుకే మాస్ జాతర ఇప్పుడప్పుడే రిలీజ్ చేయకుండా వాయిదా వేస్తున్నారని కొన్నిరోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇక ఆ రూమర్స్ ను నిజం చేస్తూ నేడు మాస్ జాతర వాయిదా పడిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. అయితే కారణం మాత్రం సమ్మె వలన ఆగిందని చెప్పుకొచ్చారు.
” ఇటీవల పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా కొన్ని పనులు ఇంకా పూర్తికాలేదు. అందుకే మాస్ జాతరను ఆగస్టు 27 న రిలీజ్ చేయలేకపోతున్నాం. కానీ త్వరలో మీ కోసం అతిపెద్ద మాస్ ఫీస్ట్‌ను థియేటర్లలోకి తీసుకురావడానికి మా చిత్ర బృందం శాయశక్తులా కష్టపడుతుంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో కలుద్దాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 31 న మాస్ జాతర రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ లో కాంతార చాఫ్టర్ 1, తెలుసు కదా సినిమాలు వస్తున్నాయి. అవేమి ఈ మాస్ జాతరకు పోటీ ఉండవు. దీంతో ఈ సినిమా మంచి డేట్ నే పట్టిందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Due to recent industry-wide strikes and unforeseen delays in wrapping up crucial content, #MassJathara will not be arriving on its planned date of Aug 27th.
But the team is working relentlessly to bring you the BIGGEST MASS FEAST in theatres soon! ❤️🔥💥
New release date will be… pic.twitter.com/m3d0yCDH38
— Sithara Entertainments (@SitharaEnts) August 26, 2025