BigTV English

Goa Weekend Trip: వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రైళ్లలో నేరుగా వెళ్లిపోవచ్చు!

Goa Weekend Trip: వీకెండ్‌లో హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రైళ్లలో నేరుగా వెళ్లిపోవచ్చు!

Goa Weekend Trip From Hyderabad:

గోవా గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. అద్భుతమైన బీచ్ లు, అక్కడ ఆడే గేమ్స్, ఉత్సాహభరితమైన నైట్ లైఫ్ ప్రతి ఒక్కరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తే, ఎలా వెళ్లాలి? ఏ ప్రదేశాలను చూడాలి? ఎక్కడ స్టే చేయాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా వీకెండ్ టూర్ అనేది శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉంటుంది. గోవాలో సుమారు 2 రోజుల పాటు కంప్లీట్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. వీకెండ్ టూర్ అనేది రూ. 4,524 నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ నుంచి గోవా సుమారు 800 కి.మీ దూరంలో ఉంటుంది. వీకెండ్ టూర్ కు వెళ్లడానికి విమాన ప్రయాణం బెస్ట్ అని చెప్పుకోవచ్చు.రోడ్డు, రైలు మార్గం ద్వారా వెళ్లడానికి కంగా 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే కేవలం 2 గంటల్లో వెళ్లవచ్చు.

⦿ విమానంలో: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసులు న్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా సంస్థలు విమానాలను నడుపుతున్నాయి. శుక్రవారం సాయంత్రం వెళ్లి, సోమవారం ఉదయం తిరిగి రావచ్చు. వన్ వే ఛార్జీలు రూ. 3,000-6,000 ఉంటాయి. విమానాశ్రయం నుంచి క్యాండోలిమ్ లాంటి ప్రాంతాలకు టాక్సీలో వెళ్లొచ్చు.


⦿రైలు ద్వారా: మీకు రైలు ద్వారా వెళ్లాలని ఇష్టం ఉంటే, హైదరాబాద్- వాస్కోడిగామా ఎక్స్‌ ప్రెస్ (17021)తో పాటు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ దక్కన్ రైళ్లు నడుస్తాయి. ప్రయాణ సమయం 17 నుంచి 20 గంటలు పడుతుంది.  అందుబాటులో ఉంటే శుక్రవారం రైలును పట్టుకోవడం బెస్ట్. శనివారం ఉదయం చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్‌ కు ఛార్జీలు రూ. 430 నుంచి ప్రారంభమవుతాయి.

⦿ బస్సు ద్వారా: సౌకర్యవంతమైన AC స్లీపర్ బస్సులు ప్రతిరోజూ నడుస్తాయి.  సుమారు 16 గంటల సమయం పడుతుంది  ఇంటర్‌ సిటీ స్మార్ట్‌ బస్,  రెడ్‌ బస్, ఈజ్‌ మైట్రిప్ లాంటి యాప్స్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సాయంత్రం బయల్దేరి మరుసటి రోజు ఉదయం గోవాకు చేరుకుంటాయి. ఛార్జీలు: రూ. 1,000-2,500 వరకు ఉంటాయి. చక్కటి సౌకర్యం కోసం వోల్వో ACని ఎంచుకోవడం బెస్ట్. లేదంటే అలిసిపోయే అవకాశం ఉంటుంది.

⦿ సొంత వాహనంలో:  అడ్వెంచరస్ టూర్ ఫీల్ రావాలంటే సెల్ఫ్ డ్రైవ్ లేదంటే క్యాబ్ లో వెళ్లడం బెస్ట్. NH44, NH748 ద్వారా.. రాయచూర్, హుబ్బళ్లి  మీదుగా 15 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. మార్గం మధ్యలో బెల్గాం, కర్నూలు మార్గాలు కూడా ఉంటాయి. టోల్ ఖర్చులు: రూ. 1,000-1,500, ఫ్యూయెల్ ఖర్చులు రూ. 5,000 అవుతాయి. దాబాల్లో ఫుడ్ తీసుకోవచ్చు.

రెండు రోజులు ఎలా ఎంజాయ్ చేయాలంటే?

ఫస్ట్ డే.. నార్త్ గోవాలో పర్యటించాలి. బీచ్ లోని ఇసుక తిన్నెల్లో ఎంజాయ్ చేయండి. పారాసెయిలింగ్ లాంటి గేమ్స్ ఆగవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అగ్వాడా కోటకు వెళ్లి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. సావనీర్‌ల కోసం కలాంగూట్ బీచ్‌లోని షాక్‌ల గుండా షికారు చెయ్యొచ్చు. టిటోస్ లేన్‌ లో డిన్నర్, నైట్ లైఫ్‌ ఎంజాయ్ చెయ్యొచ్చు.రెండో రోజు చపోరా కోట, సమీపంలోని వాగేటర్ బీచ్‌ను చూడవచ్చు.  ఫ్లీ మార్కెట్‌లు, వాటర్ స్పోర్ట్స్ కోసం అంజునా బీచ్‌కి వెళ్లండి. మధ్యాహ్నం అశ్వేమ్ బీచ్‌ లో రెస్ట్ తీసుకోవచ్చు. స్నో పార్క్, స్పైస్ ప్లాంటేషన్ టూర్ కు వెళ్లవచ్చు.  సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లే ముందు మోర్జిమ్ బీచ్ లో సన్ సెట్ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఒకవేళ మీరు సౌత్ గోవాను ఇష్టపడితే పలోలెం బీచ్, బటర్ ఫ్లైస్ స్పాటింగ్, కోలా లగూన్ కయాకింగ్‌ లాంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు.

ఎంత ఖర్చు అవుతుందంటే?  

రెండు రోజుల పాటు గోవాలో ఎంజాయ్ చేసి రావడానికి ఒక్కో వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.  ప్రయాణం రౌండ్ ట్రిప్ విమాన టికెట్లకు రూ. 6,000-10,000 అవుతుంది. రెండు రాత్రలు బస చేయడానికి రూ. 3,000-6,000 అవుతుంది. ఫుడ్, రవాణా కోసం రూ. 2,000-4,000 అవుతుంది. ఇతర అవసరాల కోసం రూ. 1,000-3,000 అవుతుంది.  మొత్తం: రూ. 12,000-23,000 అవుతుంది. షాపింగ్/సావనీర్‌లకు అదనపు ఖర్చు అవుతుంది. ఒకవేళ విమానం కాకుండా, రైలు, లేదంటే బస్సులో వెళ్లే ఇంకాస్త ఖర్చు తగ్గుతుంది.

Read Also: IRCTC ఇంటర్నేషనల్ టూర్స్, ఏకంగా విమానంలో ఎగిరిపోవచ్చు!

Related News

IRCTC Tour Packages: IRCTC ఇంటర్నేషనల్ టూర్స్, ఏకంగా విమానంలో ఎగిరిపోవచ్చు!

Longest Train: ఈ రైలు ఎక్కితే వాంతులు చేసుకుంటారు.. ఇండియాలో ఇదే అత్యంత డర్టీ ట్రైన్!

Crime News: ఉన్నట్టుండి.. స్నేహితుడిని రైలు కిందకు తోసేసిన ఫ్రెండ్.. అసలు సంగతి తెలిసి షాక్!

Festival Special Trains: చర్లపల్లి నుంచి 22 ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో రైల్వే గుడ్ న్యూస్!

Train Accident: బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!

Big Stories

×