Mega 157:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) .. ఏడుపదుల వయసుకి చేరువలో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. గత ఏడాది వశిష్ట మల్లిడి (Vassishta Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా ప్రకటించారు. దాదాపు సినిమా కూడా పూర్తి కావస్తోంది. ఇంకా విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు. అటు సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేయాలనుకున్నా.. తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) మూవీ డేట్ ఫిక్స్ చేసుకుంది. కాబట్టి తమ్ముడు సినిమాకి పోటీగా తన సినిమాను రంగంలోకి దింపలేకపోతున్నారు చిరంజీవి. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై గందరగోళం ఏర్పడిందని చెప్పవచ్చు.
అన్నయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
మరొకవైపు ఫ్లాప్ ఎరుగని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara ) హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపిస్తూ మళ్లీ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఏడాది షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని మేకర్స్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పవచ్చు.
చిరు బర్త్డే స్పెషల్.. మెగా 157 టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ మూవీలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 157 మూవీ టైటిల్ తో పాటూ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారట. ఇక ఈ విషయం తెలిసి అన్నయ్య అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా 157 మూవీకి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే వచ్చే ఏడాది 2026 జనవరి 14న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు విషయాలను అన్నయ్య బర్తడే సందర్భంగా అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.
అన్ని అప్డేట్స్ ఆ రోజే..
ఈ సినిమా తర్వాత చిరంజీవి బాబి (Bobby) డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా గురించి కూడా పూర్తి వివరాలు అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం మొత్తానికైతే చిరంజీవి 70వ పుట్టిన రోజు వేడుకలను ఈసారి చాలా పగడ్బందీగా జరపాలి అని, అటు అభిమానులే కాదు ఇటు ఆయన చిత్ర బృందాల యూనిట్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాయి. మరి ఆరోజు ఏ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ వెలువడుతుందో చూడాలి.
ALSO READ:Film industry: స్టార్ కటౌట్ కాదు కంటెంట్ ఉండాలి గురూ.. నిరూపిస్తున్న ఆడియన్స్.. దెబ్బకి ఔట్!