Gundeninda GudiGantalu Today episode August 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి నేను చేయలేనని చెప్పు మనోజ్ మనిద్దరం దూరంగా ఉండటం అంటే నా వల్ల కాదు అని అంటుంది.. కానీ ప్రభావతి మాత్రం ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే అని కండిషన్ పెడుతుంది. సత్యంని, మీనాని అందరినీ రెడీ అవ్వమని చెప్తుంది. శృతి మనము ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతుంది.. ప్రభావతిని శృతి ఇంత కష్టమైన పూజ చేయడం అవసరమా అని అడుగుతుంది. ప్రభావతి మాత్రం ఎంత కష్టమైనా పర్లేదు వాళ్ళ నాన్న కోసమే కదా చేయాల్సిందే అని అంటుంది.. అందరూ కలిసి గుడికి వెళ్ళాలి అని కూడా రమ్మని చెప్పు అని సత్యం అంటాడు. కల్పనాని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్న బాలు తాను వెళ్లేంతవరకీ తనకి పికప్ అండ్ డ్రాపింగ్ చేసేందుకు ఒప్పుకుంటాడు. మీనా ఫోన్ చేసి అర్జెంటుగా గుడికి రావాలని అడుగుతుంది. బాలు ఆమె పర్మిషన్ తీసుకొని గుడి దగ్గరికి వెళ్తాడు. అందరూ కలిసి గుడికి వెళ్తారు. బాలు కూడా అక్కడికి వచ్చి రోహిణి పూజ చేయడం ఇష్టం గా ఉండాలని..ఇలా ఉండకూడదు అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్న బయటకు వస్తాడంటూ పూజలు చేయాలని రోహిణిని బలవంతంగా గుడికి తీసుకొని వెళుతుంది అక్కడ వెళ్ళగానే స్నానం చేయించి, చేతిలో హారతి ఇవ్వమని చెప్తుంది. అంతే కాదు పూజారి చెప్పినట్టు అంగప్రదక్షిణాలు చేయాలి అనగానే రోహిణి షాక్ అవుతుంది. పాలు మాత్రం మొత్తము సిలిండర్ దొల్లినట్టు డోళ్ళాలి అదే అంగప్రదక్షిణ అని బాలు క్లారిటీగా చెప్తాడు. రోహిణి చేస్తుంటే మనోజ్ కి ఫోన్ వస్తుంది. మనోజు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. కల్పన అక్కడ మనోజ్ ని చూసి దాక్కుంటుంది..
మనోజు ఫోన్ మాట్లాడి వస్తుంటే బాలు వెళ్లిపోవడంతో బాలుని ఆపి ఏంట్రా నువ్వు ఉండట్లేదా? వెళ్ళిపోతున్నావా? అని అడుగుతాడు. ఏ నువ్వు గుడి బయట అడుక్కుంటావా ఏంటి అని బాలు అడుగుతాడు. ఇదంతా కాదురా నువ్వు లోపలికి వెళ్ళు రోహిణి అయిపోయింది ఇప్పుడు నువ్వే ప్రదక్షిణాలు చేయాలంట అని అంటాడు. మాట వినగానే మనోజ్ షాక్ అవుతాడు. ఇక బాలు కల్పనని తీసుకొని వెళ్లాలని కార్లో కూర్చుంటాడు. అయితే కల్పన ఇంత లేట్ అయింది. ఇంట్లో ఫ్యామిలీ పూజ అన్నారు మేడం అందుకే లేట్ అయింది అని బాలు అంటాడు.
ఈ పూజలంతా చేసేది కేవలం రోహిణి వాళ్ళ నాన్నను బయటికి తీసుకురావడానికి అని అంటుంది ప్రభావతి. వాళ్ళ నాన్న ని బయట తీసుకురాడానికా లేక ఆస్తులు బయటికి వస్తాయని రవి అంటాడు. అయినా రోహిణికి లేని బాధ మీకు ఎందుకు ఇది వాళ్ళ నాన్న కోసమే కదా చేసేది అని అంటుంది ప్రభావతి. ఇంకా చేయమంటే పడిపోయేలా ఉంది. పాపం రోహిణి అని అంటుంది. మీ అందరికి ఏదో బాధగా ఉందే అందరూ కలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని ప్రభావతి అంటుంది.
అయితే ఇంకేమీ పూజలు లేవు. కేవలం అర్చన మాత్రమే ఉంది అని ప్రభావతి అంటుంది.. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి దగ్గర వాళ్ళ నాన్న పేరు చెప్పడానికి ఈ రోజుని మర్చిపోతుంది… ఏదో ఒక పేరు మొత్తానికైతే చెప్పేస్తుంది. ఆ పేరుకు తగ్గట్లు ఇది అని పంతులుగారు నక్షత్రం ని చెప్తాడు. ఇక ఇది అయిన తర్వాత కటిక నేల మీద పడుకోవాలి అని చెప్తాడు. అందరూ కలిసి రోహిణి ఇంటికి తీసుకొని వస్తారు. రోహిణి నాకు కాళ్లు చాలా నొప్పులు వస్తున్నాయి అత్తయ్య గారు చేపించిన పూజల వల్ల నాకు చేత కావట్లేదు మనోజ్ అని అంటుంది.
మనోజు మంచం మీద కూర్చుపెట్టి కాళ్ళు నొక్కుతుంటే ప్రభావతి చవట లాగా కాలు నొక్కుతున్నావ్ ఏంట్రా అని అంటుంది.. ఈరోజు నుంచి భార్యాభర్తలిద్దరూ ఒకే గదిలో కూడా ఉండకూడదు అని కండిషన్ పెడుతుంది. ఇక కిందికి రాగానే శృతి రవి మనోజ్ ఆకలిగా ఉంది. ఏదైనా తినాలనిపిస్తుంది ఇంకా వంట చేయలేదని అనుకుంటారు. ఇది మాత్రం నాకు చాలా ఆకలిగా ఉంది ఈ రోజు నాకు ఫిష్ తినాలనిపిస్తుంది అని అంటుంది. అయితే మన ముగ్గురికి నేను ఫిష్ ఆర్డర్ పెడతాను అని రోహిణి అంటుంది. ప్రభావతి మాత్రం పూజ చేస్తున్న ఇంట్లో ఇలాంటివి చేయకూడదు అని అంటుంది.
మీనా ఈ రోజుకి ఏదో ఒకటి సర్దుకోండి రేపు మీరు ఏది కావాలంటే అది చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత నేను మాత్రం పూజలో ఉంటే నువ్వు నాన్ వెజ్ తింటావా అని రోహిణి అంటుంది. ఇంట్లో ఎవరూ నీసు తినకూడదు అని సత్యం అంటాడు. రోహిణి చూసి బాలు సెటైర్లు వేస్తాడు. ఏంటి ఒంటి కాల మీద నిలబడుతుంది అని అనుకుంటే ఇలా చేస్తుంటే ఏంటి అని అంటాడు. గుడిలో నువ్వు నాగిని డాన్స్ చేయించావు కదా ఇప్పుడు వంటి కాల మీద కాకుండా రోహిణి ఇలా ఉండడం షాక్ అనిపిస్తుంది అని అంటాడు.
ఇక రోహిణి చేత బలవంతంగా వంట చేయిస్తాడు బాలు. ఇక రాత్రి అవ్వగానే బాలు కోసం మీనా పాలు తీసుకొని వస్తుంది. ఏంటి పాలు అని సరసాలు ఆడతాడు. మీనా ఏంటి ఈరోజు మీరు కొంచెం ఏదోలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. అయితే ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు కదా అందుకే కాస్త సరసాలు మొదలయ్యాయి అని బాలు అంటాడు. ఇద్దరు కలిసి ఆ రాత్రిని వాళ్లకు తగ్గట్లుగా మార్చుకుంటారు. ఉదయం లేవగానే మీనా ముగ్గు వేయాలని బయటికి వెళ్తే.. ప్రభావతి బయట నిలబెట్టేస్తుంది ఆ విషయం తెలుసుకున్న బాలు ఏంటి మీనా ఇలా శిల్పం లాగా నిలబడ్డావు అని అడుగుతాడు. శిల్పం లాగా కాదండి మీ అమ్మగారు నన్ను ఇక్కడే నిలబడమని చెప్పారు అందుకే నేను ఇక్కడే నిలబడ్డాను.
Also Read : ‘కూలీ’లో నాగార్జున క్యారక్టర్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?
ఇది ఒక కొత్త పనిష్మెంట్ నా.. అదే చెప్తున్నాను అప్పుడు అక్కడికి వచ్చిన సత్యంతో బాలు చూసారా నాన్న మీ ఆవిడ మా ఆవిడని ఇక్కడ నిలబెట్టింది అని అంటాడు. ఇంట్లో నుంచి బలవంతంగా ప్రభావతి బయటకు తీసుకొని వస్తుంది. ఆలు పాలనమ్మ అంత పెద్ద తప్పు ఏమి చేసింది నువ్వు బయటికి గెంటేస్తున్నావ్ అని అడుగుతాడు. రోహిణి ఏమైందో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. ఈ పూజ అయిపోయేంతవరకు ప్రతిరోజు రోహిణి ముగ్గు వేయాలని కండిషన్ పెడుతుంది ప్రభావతి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మనోజ్ కి కల్పన దొరుకుతుందేమో చూడాలి..