Chia Seeds: చియా సీడ్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి వీటిలో ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఇదిలా ఉంటే ఇవి గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించడంతో పాటు బరువు తగ్గడం వంటి వాటికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని నీటిలో నాన బెట్టినప్పుడు ఉబ్బి, పుడ్డింగ్ లాంటి అనుగుణ్యతను పొందుతాయి. అందుకే ఇన్ని ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్ 2 వారాల పాటు తింటే శరీరంలో 7 రకాల మార్పులు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
7 రకాల ప్రయోజనాలు:
మెరుగైన జీర్ణక్రియ: చియా సీడ్స్‌లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మలబద్దకం వంటి సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా వీటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
బరువు తగ్గడంలో సహాయం: ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా చియా సీడ్స్‌లో ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు తరచుగా చియా సీడ్స్ తినడం మంచిది.
గుండె ఆరోగ్యం: చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే చియా సీడ్స్ తినడం చాలా మంచిది.
శక్తి స్థాయిలు పెరుగుతాయి: వీటిలో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు శరీరానికి నిరంతర శక్తిని అందిస్తాయి. ఇది రోజువారీ పనులు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఉదయం పూట చియా సీడ్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయిన శక్తి కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: జీర్ణ సంబంధిత సమస్యలా ? అయితే ఇవి వాడండి
ఎముకల దృఢత్వం: చియా గింజలలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, పళ్లను బలపరుస్తాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ: చియా గింజలు ఆహారం జీర్ణం అయ్యే వేగాన్ని తగ్గిస్తాయి, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదల అవుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులు తరచుగా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది: యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల.. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది. జుట్టుకు కూడా చియా సీడ్స్ చాలా మేలు చేస్తాయి. వీటితో తయారు చేసిన మాస్క్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.