E-Paper
Advertisement

కెరూబ్’ ట్రైలర్ రిలీజ్.. రామాయణం అంత హిట్ అవుతుందా?

కెరూబ్’ ట్రైలర్ రిలీజ్.. రామాయణం అంత హిట్ అవుతుందా?
Advertisement

Kherrub Movie:ఇటీవలకాలంలో వినూత్న కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో చిత్రాలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కథల విషయం కాస్త పక్కన పెడితే.. సినిమా టైటిల్స్ విషయంలో కూడా కాస్త ఆసక్తి కలుగుతోంది. అయితే మరికొన్ని టైటిల్స్ వివాదం కూడా సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆరమిక్ లాంగ్వేజ్ నుండి తన సినిమా టైటిల్ ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి ఆ సినిమా టైటిల్ ఏంటి? దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

కెరూబ్ సినిమా ట్రైలర్ విడుదల..

ఖుషీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విహాన్ కార్తీక్ హీరోగా MJ నాయుడు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం “కెరూబ్”. గత, వర్తమాన, భవిష్యత్తు అనేవి ట్యాగ్ లైన్స్. ఈ చిత్రానికి సంగీతం సత్య రాధాకృష్ణ అందించగా, రమేష్ తోకల సినిమాటోగ్రఫీ అందించారు. ఇకపోతే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఎం జె నాయుడు మాట్లాడుతూ.. కథంతా టైటిల్ లోనే ఉండాలని ఆరమిక్ లాంగ్వేజ్ నుంచి “కెరూబ్” అనే టైటిల్ ను ఎంచుకున్నాను అంటూ తెలిపారు.

మన ఫారెస్ట్ లో చేసిన మరో అవతార్..

Advertisement

సీనియర్ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ… సినిమా టీజర్, ట్రైలర్ చూడగానే.. మన ఫారెస్ట్ లో చేసిన అవతార్ లాగా అనిపించింది. మన తెలంగాణలో ఇంత అందమైన అడవులున్నాయా అనిపించింది. మరో రామాయణం అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. హీరో చాలా అందంగా మరో విజయ్ దేవరకొండ, నాని లాగా ఉన్నాడు. మంచి భవిష్యత్తు ఉంది. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉంది అనిపిస్తోంది.

పదహారేళ్లుగా తీస్తున్న సినిమా ఇది..

ఈచిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత M.J.నాయుడు మాట్లాడుతూ… నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా వాటితో సంబంధం లేదు అనిపిస్తోంది. ఈ స్టేజ్ వరకు రావటంతో. కుటుంబం సపోర్ట్ తో ఈ సినిమా చేయగలిగాను. దాదాపు 16 ఏళ్లలో ఈ సినిమా తీయగలిగాను. నాకు సినిమాటోగ్రాఫర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. గతంలో నా షార్ట్ ఫిలింకి తనే చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కు తనే అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ కూడా ఏది కావాలన్న అప్పటికప్పుడు చేసి ఇచ్చేవాడు. లిరిక్ రైటర్ అలరాజు నాకు ఎలా కావాలి అంటే అలా ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను ఎలా అడిగితే అలా చేసి ఇచ్చాడు. నా ఫ్రెండ్, తమ్ముడు లాంటి హీరో విహాన్ సపోర్ట్ ఎంతో ఉంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నా.

ఏడేళ్ల ప్రయాణం.. ఈనెల 20న మీ ముందుకు..

Advertisement

హీరో విహాన్ కార్తీక్ మాట్లాడుతూ…. సినిమాలోకి రావడానికి నాకు నా తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. మొదట్లో నేను ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రలో నటించా. అప్పుడే ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు ఎన్నో రకాలుగా ఆలోచించి ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎంతో రుణపడి ఉన్నా. ఓ కొత్త ఫేస్ కావాలని నన్ను ఎంచుకున్నారు. దర్శకుడు ఎంతో డీటెయిల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ లోకేషన్స్ ను సెట్ చేశారు. దర్శకుడితో ఆల్ మోస్ట్ 7 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నా. దాని ఫలితం ఈ నెల 20న సినిమా విడుదల అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇద్దరం కలిసి పని చేయాలనుంటున్నా.

also read:ఒకప్పుడు తాజ్ హోటల్లో పని చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?

మూడు పాటలు..

సంగీత దర్శకుడు సత్య రాధాకృష్ణ మాట్లాడుతూ… ఈ సినిమాలో మూడు పాటలున్నాయి. ఈ సినిమాకి మంచి లిరిక్స్ కుదిరాయి. నన్ను హీరో విహాన్ కార్తీక్ ఈ సినిమాకి రెఫర్ చేశారు. నిజంగా ఈ సినిమాకి పని చేయడం ఓ సాహసమే అని చెప్పాలి. మ్యూజిక్ బాగా కుదిరింది. మీకందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా.

రాజీలేని విజువల్స్..

DOP మాట్లాడుతూ… MJ నాయుడు లేకుంటే ఈ సినిమాకి పనిచేసే వాణ్ణి కాదు. చిన్నప్పటి నుంచి ఇద్దరం స్నేహితులం. రాత్రి విజువల్స్ కోసం ఎంతో కష్టపడి పని చేశాం. దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా విజువల్స్ కోసం తపన పడేవారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. మీరు వెండితెర మీద విజువల్స్ ను ఎంజాయ్ చేస్తారు.

చిత్ర తారాగణం:

విహాన్ కార్తీక్ (అనిరుధ్), దివ్య విశ్వకర్మ, కల్పలత, సుమన్ శెట్టి, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ

సాంకేతిక నిపుణులు:
సంగీతం: సత్య రాధాకృష్ణ
DOP: రమేష్ తోకల
లిరిక్ రైటర్స్: అలరాజు, మోనికా తిరుమణ్యం
ఆర్ట్ డైరెక్టర్: కొక్కుల ప్రసాద్
PRO: దుద్ది శ్రీను

Related News

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. భవిష్యత్తులో కూడా ఉంటుంది:రమ్య కృష్ణ

ఒకప్పుడు తాజ్ హోటల్లో పని చేసిన స్టార్ నటి ఎవరో తెలుసా?

ఎల్లమ్మ మూవీకి విలన్ దొరికేసినట్టేనా?

నైజాంలో కల్కి2 ధర ఎన్ని కోట్లో తెలుసా? ఎవరు దక్కించుకున్నారంటే?

తేజా సజ్జాకు కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? జాక్ పాట్ కొట్టాడుగా..

మలేషియలో పెళ్లి చేసుకున్న బుజ్జమ్మ.. అసలు కారణమేంటో తెలుసా..?

Nabha Natesh : ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?

Big Stories

Advertisement
×