E-Paper
Advertisement

రైల్లో సైడ్ లోయర్ బెర్త్‌ నే ఎందుకు కోరుకుంటారు? సైకాలజీ చెప్పే క్రేజీ విషయాలివే!

రైల్లో సైడ్ లోయర్ బెర్త్‌ నే ఎందుకు కోరుకుంటారు? సైకాలజీ చెప్పే క్రేజీ విషయాలివే!
Advertisement

Side Lower Berth Lovers: రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది ప్రయాణికులు సైడ్ లోయర్ బెర్త్‌ (Side Lower Berth) కోసం ఆసక్తి చూపిస్తుంటారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఈ బెర్త్ దొరికితే చాలు అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే, మిగతా బెర్త్‌ లతో పోలిస్తే సైడ్ లోయర్‌ ప్రత్యేకత ఏంటి? కేవలం కిటికీ పక్కన కూర్చోవచ్చనే కారణంతోనే దీనిని ఇష్టపడుతున్నారా? లేక దీని వెనుక మరో ఆసక్తికరమైన కారణం ఉందా? సైకాలజీ ఏం చెప్తుందంటే..

సైడ్ లోయర్ బెర్త్‌ కే ఎందుకంత డిమాండ్?

సైడ్ లోయర్ బెర్త్‌ లో ప్రయాణించడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. పగటిపూట బెర్త్‌ ను సీటులా ఉపయోగించుకోవచ్చు. కిటికీ పక్కన కూర్చుని బయట ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. రాత్రి పడుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇతర బెర్త్‌ లకు కొంత దూరంగా ఉండటంతో ఇతర ప్రయాణికుల రాకపోకల వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించేవారు, పుస్తకాలు చదివేవారు, ల్యాప్‌టాప్‌పై పనిచేసేవారు ఈ బెర్త్‌ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అవసరమైనప్పుడు కూర్చోవడం, నచ్చినప్పుడు పడుకోవడం లాంటివి చేసే అవకాశం ఉంటుంది.

వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత!

Advertisement

సైకాలజీ ప్రకారం ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ ప్లేస్ అవసరం. మన చుట్టూ ఇతరులు ఎంత దగ్గరగా ఉండాలి? ఎవరితో మాట్లాడాలి? ఎప్పుడు ఒంటరిగా ఉండాలి? అనే విషయాలను మనమే నిర్ణయించుకోవాలనుకుంటాం. పర్సనల్ స్పేస్, ప్రైవసీ, రద్దీ లాంటి అంశాలపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. పర్సనల్ స్పేస్ అనేది మన చుట్టూ ఉండే ఓ అదృశ్య పరిధిగా భావిస్తారు. ఇతరుల అనుమతి లేకుండా ఆ పరిధిలోకి వచ్చినప్పుడు అసౌకర్యం కలగవచ్చు. సైడ్ లోయర్ బెర్త్‌ లో ప్రయాణించేవారికి తమకు నచ్చిన విధంగా సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బెర్త్‌ ను ఎక్కువ మంది ఇష్టపడుతారని నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

రద్దీ ఉన్నా ఇబ్బంది ఎందుకు ఉండదు?

సైకాలజిస్ట్ డేనియల్ స్టోకోల్స్ 1970లలో చేసిన పరిశోధనలో రద్దీకి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఎక్కువ మంది ఒకే చోట ఉండటాన్ని జనసాంద్రతగా పరిగణిస్తే, దాని వల్ల కలిగే మానసిక అసౌకర్యాన్ని రద్దీగా భావించవచ్చు. అంటే, ఒకే రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకే రద్దీని వేర్వేరుగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. తమకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని భావించే వారికి ప్రయాణం సౌకర్యంగా అనిపిస్తుంది.

సైడ్ లోయర్ ఇష్టపడేవారంతా ఒకేలా ఉండరు!

Advertisement

సైడ్ లోయర్ బెర్త్‌ ను ఎంచుకునేవారందరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయని చెప్పడానికి ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరికి కిటికీ పక్కన కూర్చోవడం నచ్చవచ్చు. మరికొందరికి బెర్త్ ఎక్కడం, దిగడం సులభంగా ఉండటం నచ్చవచ్చు. సో, సైడ్ లోయర్ బెర్త్‌ పై ఇష్టాన్ని పూర్తిగా సైకాలజీతో ముడిపెట్టలేం. అయినప్పటికీ, ప్రయాణంలో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, సౌకర్యం ఎంత ముఖ్యమో ఈ అంశం మరోసారి గుర్తుచేస్తోంది.

Read Also: అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!

Tags

Related News

అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!

కాకులు వాలని ఎకైక పుణ్య క్షేత్రం.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న యాగంటి రహస్యాలివే?

సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?

వీసా లేకుండానే ఐర్లాండ్ ట్రిప్.. భారతీయులకు బంపర్ ఆఫర్!

6:45 PM అని కాకుండా 18:45 అని ఎందుకు రాస్తారు? రైల్వే, ఎయిర్‌లైన్స్ టైమింగ్స్ ఎందుకిలా ఉంటాయి?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 96 ప్రత్యేక రైళ్లు!

ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!

Big Stories

Advertisement
×