E-Paper
Advertisement

మీకు వచ్చే ఫోన్ కాల్ బ్యాంక్ నుంచా లేక సైబర్ నేరగాళ్ల నుంచా? నంబర్ చూసి ఇలా కనిపెట్టేయొచ్చు!

మీకు వచ్చే ఫోన్ కాల్ బ్యాంక్ నుంచా లేక సైబర్ నేరగాళ్ల నుంచా? నంబర్ చూసి ఇలా కనిపెట్టేయొచ్చు!
Advertisement

Cyber Fraud Awareness: ఈ రోజుల్లో మన ఫోన్‌కు రోజూ పదుల సంఖ్యలో కాల్స్ వస్తుంటాయి. వాటిలో కొన్ని బ్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన కాల్స్ అయితే.. మరికొన్ని లోన్లు, క్రెడిట్ కార్డులు, కొత్త ఆఫర్ల పేరుతో వచ్చే ప్రమోషనల్ కాల్స్. అయితే వీటిలో ఏది నిజమైన కాల్, ఏది సైబర్ నేరగాళ్లు వేసే ఉచ్చో గుర్తించడం చాలామందికి కష్టంగా మారింది. ముఖ్యమైన కాల్ ఏమోనని లిఫ్ట్ చేస్తే వ్యక్తిగత వివరాలు అడగొచ్చు. పొరపాటున OTP, UPI PIN వంటి వివరాలు చెబితే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇకపై ప్రతి కాల్‌ను గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక నంబర్ సిరీస్‌లను గుర్తుపెట్టుకుంటే బ్యాంక్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్ మధ్య తేడాను సులభంగా తెలుసుకోవచ్చు. అసలు 1600, 140 నంబర్లకు మధ్య తేడా ఏంటి? వీటిలో ఏ నంబర్ దేనికి ఉపయోగిస్తారు? తెలుసుకుందాం.

1600 నంబర్లతో వచ్చే కాల్స్:

మీ ఫోన్‌కు 1600తో మొదలయ్యే నంబర్ల నుంచి కాల్ గానీ, మెసేజ్ గానీ వస్తే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు ముఖ్యమైన సర్వీస్ అలర్ట్స్, ట్రాన్సాక్షన్ సమాచారం అందించడానికి మాత్రమే ఈ 1600 సిరీస్ నంబర్లను ఉపయోగిస్తాయి. కాబట్టి.. ఇలాంటి నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించడం మంచిది.

140 సిరీస్ నంబర్ల కథేంటంటే?

Advertisement

మీకు 140తో మొదలయ్యే నంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తున్నాయంటే అవి కచ్చితంగా ప్రమోషనల్ కాల్స్ అని అర్థం చేసుకోవాలి. వివిధ కంపెనీల ఆఫర్లు, క్రెడిట్ కార్డులు, లోన్ల గురించి ప్రచారం చేయడానికి టెలిమార్కెటింగ్ సంస్థలు ఈ నంబర్లను వాడుతుంటాయి. వీటి వల్ల మీ బ్యాంక్ ఖాతాకు ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి మీకు అవసరం లేకపోతే వీటిని పట్టించుకోవాల్సిన పనిలేదు.

Also Read: ఎయిర్‌టెల్ రూ.598 సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీ!

ఓటీపీ, పిన్ అడిగితే మోసమే:

Advertisement

నంబర్ ఏదైనా సరే.. అవతలి వ్యక్తులు మిమ్మల్ని ఏం అడుగుతున్నారనేది చాలా ముఖ్యం. ఏ బ్యాంక్ అధికారి కూడా ఫోన్ చేసి మీ ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ లేదా పాస్‌వర్డ్‌లను అడగరు. ఒకవేళ ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు అడుగుతున్నారంటే వారు కచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించి వెంటనే కాల్ కట్ చేయండి.

అప్రమత్తతే అసలైన రక్షణ:

ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో మన డబ్బును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరికీ కొంత అవగాహన ఉండాలి. ముఖ్యంగా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయకూడదు. బ్యాంక్ ఖాతా వివరాలు, OTP, UPI PIN, CVV వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. బ్యాంకు అధికారులమని చెప్పినా సరే, ఇలాంటి వివరాలు అడిగితే నమ్మకూడదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సైబర్ మోసాల బారిన పడకుండా మన డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు.

Also Read: పదేళ్ల తర్వాత ఐఫోన్‌లో భారీ మార్పులు.. నాలుగు వైపులా వంపు తిరిగిన గ్లాస్ డిస్‌ప్లేతో iPhone 20 Pro!

Tags

Related News

ఫ్రీ Wi-Fi వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? కనెక్ట్ అయ్యే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

ఎయిర్‌టెల్ రూ.598 సూపర్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీ!

BSNL దిమ్మతిరిగే ఆఫర్.. జస్ట్ రూ.1కే కొత్త సిమ్.. 24 రోజులు ఫ్రీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

భారత్‌లోకి Motorola Edge 70 Neo 5G.. ఈ ఫోన్ కోసం ఎదురుచూడటానికి ముఖ్య కారణాలివే!

పదేళ్ల తర్వాత ఐఫోన్‌లో భారీ మార్పులు.. నాలుగు వైపులా వంపు తిరిగిన గ్లాస్ డిస్‌ప్లేతో iPhone 20 Pro!

BSNL బంపరాఫర్.. రూ.51కే కొత్త సిమ్.. అపరిమిత కాల్స్, డైలీ 2GB డేటా!

రూ.299కే 1.5GB డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏడాది పాటు ఆ సేవలు ఉచితం!

Big Stories

Advertisement
×