Ramya Krishna: రమ్యకృష్ణ పరిచయం అవసరం లేని పేరు. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ(Ramya Krishna) ఇప్పటికి తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రమ్యకృష్ణ సినీ కెరియర్ లో పలు ఐకానిక్ పాత్రలు ఉన్నాయని చెప్పాలి. ఇలా అద్భుతమైన నటనతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె ఇటీవల జైలర్ 2 (Jailer 2)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రమ్యకృష్ణ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ ఇదివరకు ఎంతోమంది సెలబ్రిటీలు వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అయితే తాజాగా రమ్యకృష్ణ కూడా ఇండస్ట్రీలో ఉన్న ఈ ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు గతంలో ఉన్నాయి, ప్రస్తుతం కూడా ఉంది, భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలో ఈ ఇబ్బందులు ఉంటాయని రమ్యకృష్ణ తెలిపారు.
క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నో చెప్పడానికి వీలు లేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు దానికి ఓకే చెప్పాలా? లేదా? అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుందని రమ్యకృష్ణ తెలిపారు. ఇలాంటి సంఘటనలు బలవంతంగానూ లేదా, తప్పనిసరి పరిస్థితులు, ఇష్ట పూర్వకంగా కూడా జరుగుతూ ఉంటాయని ఈమె తెలిపారు. ఇక మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి అందరి ఫోకస్ మా పైనే ఉంటుంది. అందుకే మా గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని రమ్యకృష్ణ తెలిపారు.
నిజానికి ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఒక సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు అన్ని రంగాలలో కూడా ఉన్నాయని, ప్రస్తుత కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈమె తెలిపారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి రమ్యకృష్ణ మాట్లాడిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలు కూడా గతంలో పలు సందర్భాలలో ఇదే అంశం గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక రమ్యకృష్ణ ప్రస్తుతం పలు కీలక ప్రాజెక్టులలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: పెట్టింది లక్షల్లో లాభాలు మాత్రం కోట్లలో.. రాను బొంబాయికి రాను క్రేజ్ వేరే లెవెల్!