Death Certificates: మంచిర్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో అనథరైజ్డ్ డెత్ సర్టిఫికెట్‌ల అంశం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. బూదాకలన్, పెద్దబుదా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అనధికార డెత్ సర్టిఫికెట్‌లు జారీ చేసినట్టు అధికారలు గుర్తించారు.
దీంతో ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెల్లింది. ప్రభుత్వ నిబందనలకు వ్యకతిరేఖంగా అనధికార మరణ ధ్రువ పత్రాల జారీ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. దీంతో జారీ చేసిన నలుగురూ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బూదాకలన్, పెద్దబుదా గ్రామాలలో 16 వరకు అనధికారిక మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు అయినట్లు అధికారులు గంహించారు. దీంతో ఈ భాగోతం బట్టబయలైంది.
బూదాకలాన్ గ్రామపంచాయతీ కార్యదర్శి అయిన బోర్లాకుంట శ్రీనివాస్, పెద్దబుదా పంచాయతీ కార్యదర్శి సైదుల్ల, పెర్కపల్లి ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి సాయిరాం, గతంలో బదిలీపై వెళ్లిన కార్యదర్శి స్నిగ్ధ పై కూడా వీరందరిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. అసలు అనధికార మరణ ధృవీకరణ పత్రాలు ఎందుకోసం జారీ చేశారనే విషయం పై విచారణ చేపట్టారు. ఈ మొత్తం నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైందని అధికారుల చర్యలు చర్యలు తీసుకోనున్నారు.
Also Read: అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం