Kannappa Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మంచు కుటుంబం(Manchu Family) అంటేనే ఇటీవల కాలంలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. మంచు కుటుంబం నుంచి ఎలాంటి సినిమాలు వచ్చిన, లేదా మంచు కుటుంబ సభ్యులు ఒక పోస్ట్ వేసినా, మీడియాతో మాట్లాడిన భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక మంచు హీరోలు చేసే సినిమాలు గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల మోహన్ బాబు నిర్మాణంలో విష్ణు తన డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప (Kannappa) అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా ద్వారా మంచు విష్ణు చాలా గొప్ప ప్రయత్నం చేశారని ప్రశంసలు అందుకున్నారు.
కన్నప్పతో విష్ణు సాహసం..
కన్నప్ప వంటి అద్భుతమైన సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేయటం నిజంగా గొప్ప సాహసమే అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలకు ముందు కూడా చిత్ర బృందం సినిమా గురించి ట్రోల్స్ చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోబడతాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రోలర్స్ కు ఛాన్స్ లేకుండా సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా నటించారని చెప్పాలి. ఇక మంచి విష్ణు సినీ కెరియర్ లో కన్నప్ప సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టాయని చెప్పాలి. ఇలా ఈ సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ ఉండగా కొంతమంది మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.
కర్మను ట్రోలర్స్ తీసుకెళ్లారు..
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబుకు (Mohan Babu)సినిమా గురించి వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా ఈ సినిమా గురించి వస్తున్న ట్రోల్స్ పట్ల మోహన్ బాబు స్పందిస్తూ..” విమర్శ.. సద్విమర్శ.. ప్రకృతి వికృతి రెండూ ఉంటాయి. నాకు ఒక పెద్దాయన చెప్పారు.. ఇదివరకు గాని గత జన్మలో గాని చేసుకున్న కర్మ ఈ కామెంట్స్ చేసిన వారి రూపంలో వెళ్లిపోతాయని చెప్పారు. అలా మా గురించి ట్రోల్స్ చేసిన వారు కూడా బాగుండాలి. వాళ్ళ అమ్మానాన్నలు వారి కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి అంటూ” ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
“I always wish well for those and their families who troll or criticise us,” – #MohanBabu#Kannappa #KannappaMovie #Tollywood #Tupaki pic.twitter.com/YEN47Gqhfp
— Tupaki (@tupaki_official) July 11, 2025
ఇక కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడినట్లు తెలియజేశారు. ఇంత గొప్ప సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు చిత్రబృందం కష్టపడ్డారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాని డబ్బు కోసం కాకుండా భక్తి కోసమే చేసామని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన సంగతి తెలిసిందే. రుద్ర పాత్రలో ప్రభాస్ నటన అద్భుతంగా అనిపించింది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో నటించడం వల్ల కన్నప్ప సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని స్వయంగా విష్ణు తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి తదితరులు భాగమయ్యారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read: Sujeeth: ఎవడొస్తాడో..రండి తేల్చుకుందాం..కాక రేపుతున్న సుజిత్ కామెంట్?