BigTV English

Sujeeth: ఎవడొస్తాడో..రండి తేల్చుకుందాం..కాక రేపుతున్న సుజిత్ కామెంట్?

Sujeeth: ఎవడొస్తాడో..రండి తేల్చుకుందాం..కాక రేపుతున్న సుజిత్ కామెంట్?

Sujeeth: ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజిత్(Sujeeth) త్వరలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ఈయన “ఓజీ “(OG) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు నిర్మాతలు ఇదివరకే వెల్లడించారు.


సెప్టెంబర్ లోనే రాబోతున్న OG…

ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల వాయిదా పడుతుందని ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటించిన విశ్వంభర (Vishwambhara) సెప్టెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2(Akhanda 2) సినిమా కూడా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇదివరకే నిర్మాతలు అధికారకంగా ప్రకటించారు. ఇలా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.


రికార్డులు కొల్లగొడుతున్నాం..

ఇలా ఈ ఇద్దరి స్టార్ హీరోలు ఒకేసారి విడుదలయితే బాక్సాఫీస్ వార్ మామూలుగా ఉండదని చెప్పాలి. ఇండస్ట్రీలో వినపడుతున్న కథనాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా వాయిదా పడే అవకాశాలు ఏమాత్రం లేవని ఇదివరకే నిర్మాతలు కూడా తెలిపారు. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ సుజీత్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా సుజిత్ ఓజి సినిమా విడుదల గురించి స్పందిస్తూ…” OG సినిమాతో రికార్డులన్నీ కొల్లగొడుతున్నాం… ఎవడొస్తాడో..రండి” అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈయన పరోక్షంగా బాలకృష్ణ ,చిరంజీవి సినిమాలను ఉద్దేశించే మాట్లాడారు అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.ఇకపోతే సుజిత్ చేసిన ఈ వ్యాఖ్యలు నిజం కాదని , కొందరు ఏఐ ద్వారా ఈ వీడియోని రూపొందించారని పవన్ అభిమానులు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు పోటీగా బాలయ్య…

చిరంజీవి విశ్వంభర కూడా సెప్టెంబర్ లోనే రాబోతోంది. ఇక బాలయ్య సినిమా కూడా సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న నేపథ్యంలోనే సుజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమా వెనుకడుగు వేసే ప్రసక్తి లేకపోతే బాలయ్య సినిమాని విడుదల వాయిదా పడుతుందని వార్తలు కూడా బయటకు వచ్చాయి. బహుశా అఖండ 2 సెప్టెంబర్ లో కాకుండా డిసెంబర్ లో విడుదల కాబోతుందని సమాచారం.అయితే ఈ సినిమా విడుదల వాయిదా గురించి మేకర్స్ ఎక్కడ స్పందించలేదు. ఇక డిసెంబర్లో మరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ కు పోటీగా బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలను విడుదల చేస్తారా? లేదంటే తప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Nayanatara: వామ్మో నిమిషానికి 10 కోట్లు… ఈమె ముందు హీరోలు కూడా పనికిరారుగా?

Related News

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Big Stories

×