రోజంతా ఏసీలో ఉంటే యవ్వనంగా ఉంటారా? చల్లదనం కారణంగా వృద్ధాప్యం ఆగిపోతుందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? ఇంతకీ ఏసీలో ఉండటం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఏసీ గాలిని పొడిగా చేస్తుంది. ఈ పొడి వాతావరణం చర్మం నుంచి నీటిని లాగుతుంది. చర్మం గరుకుగా మారుతుంది. త్వరగా ముడతలు పడేందుకు కారణం అవుతుంది. జపాన్‌లో జరిగిన ఒక అధ్యయనం తక్కువ తేమ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించింది. తక్కువ తేమ ఉన్న గదిలో కొంత మందిని 30 నిమిషాలు ఉంచారు. ఆ తర్వాత, చర్మం తేమ, చర్మం సాగే గుణం తగ్గింది. ముడతలు పెరిగాయి. శీతాకాలంలో జరిగిన మరో పరిశోధనలో.. పొడి గాలి కారణంగా 6 గంటల తర్వాత చర్మం గరుకుగా మారి ఎక్కువ ముడతలు పడ్డాయని తేలింది. ఏసీ కారణంగా చర్మం తేమను కోల్పోవడం వల్ల చర్మం త్వరగా వృద్ధాప్యం చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిగా ఎరుపు రంగులోకి మారుతుంది. పైగా దురదకు కారణం అవుతుంది. ఏసీ కారణంగా మనిషి త్వరగా అలసిపోవడంతో పాటు వృద్ధాప్య ఛాయలు ఏర్పడుతాయి.
శరీరం వేడి, చలిని స్వయంగా కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఎక్కువ AC అనేది ఈ ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ఏసీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు, వేడి శరీరానికి ఇబ్బంది కలిగిస్తుంది. గుండె, రక్త నాళాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. AC గదుల్లో ఉన్నవారికి శ్వాస సమస్యలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నెమ్మది నెమ్మదిగా శరీరం పని చేసే విధానం నెమ్మదిస్తుంది. ఈ కారణంగా త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. AC శరీరం నుంచి నీటిని లాగి డీహైడ్రేట్ చేస్తుంది. డీహైడ్రేటెడ్ వ్యక్తులు తరచుగా అలసిపోయినట్లు కనిపిస్తారు.
AC గదులలో ఉన్నవారు తక్కువగా కదులుతారు. రోజంతా కూర్చుంటారు. దీని వలన కండరాలు బలహీనపడతాయి. శరీర పనితీరు నెమ్మదిస్తుంది. తక్కువ కదలిక శరీరం త్వరగా వృద్ధాప్యం చెందేందుకు కారణం అవుతుంది. లావుగా మారే అవకాశం ఉంటుంది. ఇది వృద్ధాప్య సంకేతాలను పెంచుతుంది.
సూర్యరశ్మి, విటమిన్ డి లేకపోవడంతో ఇబ్బందులు
AC గదిలో ఉండటం వల్ల సూర్యరశ్మి తగలదు. సూర్యరశ్మి చర్మంలో విటమిన్ డిని తయారు చేయడంలో సహాయపడుతుంది. కాంతి పడకపోవడం వల్ల విటమిన్ డి లోపం వస్తుంది.ఈ లోపం ఎముకలను బలహీనపరుస్తుంది. శరీర శక్తిని తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల చర్మం, శరీరం ఇబ్బందికి గురవుతాయి. త్వరగా పెద్దవారిగా కనిపించవచ్చు.
AC సౌకర్యాన్ని కలిగిస్తుంది. కానీ, అతిగా వినియోగించకూడదు. యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి.
⦿ అవసరమైనప్పుడు మాత్రమే 24-26°C మధ్య ACని ఉపయోగించాలి.
⦿ విటమిన్ D కోసం ప్రతిరోజూ 30 నిమిషాలు ఎండలో నడవాలి.
⦿ తేమను పెంచడానికి ఎక్కువ నీరు తాగాలి.
⦿ చేపలు, పాలు లాంటి విటమిన్ D ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ పద్దతులు పాటించడం వల్ల వృద్ధాప్యాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు.
Read Also: రాళ్ల మధ్యలో 3800 ఏళ్ల అద్భుత ఆలయం, అదీ హైదరాబాద్ లోనే!