BigTV English

Little Hearts: మీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్ ఉందా? జోక్ నిజం అయిపోయింది

Little Hearts: మీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్ ఉందా? జోక్ నిజం అయిపోయింది

Little Hearts: ప్రజెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలామంది మంచి పేరును సంపాదించుకున్నారు. ఇప్పుడు కొంతమంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటులుగా కూడా రాణిస్తున్నారు. అలా యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ తనకంటూ కొంతమంది అభిమానులను ఏర్పాటు చేసుకున్నాడు మౌలి తనుజ్. మౌళి టాక్స్ అనే పేరుతో ఇతను యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్లో ఇతని వీడియోస్ చాలా ఫేమస్. అలానే మౌళి చేసిన రీల్స్ కూడా అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.


మౌళి చేసిన కొన్ని వీడియోస్ ని కొంతమంది మీమర్స్ విపరీతంగా వైరల్ చేశారు. వాటిని కొన్ని టెంప్లెట్స్ గా వాడటం వలన మౌళి వీడియోలు ఇంకా ఫేమస్ అయ్యాయి. ఇంస్టాగ్రామ్ లో తక్కువనిడివి ఉన్న వీడియోలు చూసి చాలామంది యూట్యూబ్ కి వెతుక్కుని వెళ్లి మరి మౌళి వీడియోలు చూసేవాళ్ళు. ఒక చిన్నగా మౌళికి సినిమాల్లో అవకాశం రావడం మొదలయ్యాయి. రితీష్ రాణా దర్శకత్వంలో హ్యాపీ బర్త్డే అనే సినిమాలో కనిపించాడు.

జోక్ నిజం అయింది

అమెజాన్ ప్రైమ్ వీడియోలో హాస్టల్ డేస్ అనే ఒక సిరీస్ వచ్చింది. ఆ సిరీస్ లో మౌలికి మంచి గుర్తింపు లభించింది. అలానే ఈటీవీలో వచ్చిన 90స్ కూడా మంచి హిట్ అయింది. ఒక తరుణంలో మౌళి చేసిన వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి. వాటిలో మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్ ఉందా అని అడిగే వీడియో బాగా పాపులర్. అయితే ఇప్పుడు ఆ వీడియో నిజం అయింది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి, శివాని నటించిన సినిమా లిటిల్ హార్ట్స్ ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.


బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ లభిస్తుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే మౌళి అప్పుడు సరదాగా చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజం అయిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హౌస్ ఫుల్ రికార్డ్ మౌళి సినిమాకు వచ్చింది. దీనినే ఈటీవీ విన్ కూడా షేర్ చేసింది.

అన్నిటిని మించి 

నేడు ప్రేక్షకులు ముందుకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. అనుష్క నటించిన ఘాటి , మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన మదరాసి (Madharaasi) సినిమాతో పాటు లిటిల్ హార్ట్స్ కూడా విడుదలైంది. అయితే మిగతా రెండు సినిమాలు అంతంత మాత్రమే ఉన్నాయి. రివ్యూస్ కూడా మిక్స్డ్ వస్తున్నాయి. కానీ మౌళి సినిమాకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుంది.

Also Read: Madharaasi Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×