E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో పౌరసరఫరాల శాఖ దాడులు.. భారీగా బియ్యం బస్తాలు సీజ్!

ఖమ్మం జిల్లాలో పౌరసరఫరాల శాఖ దాడులు.. భారీగా బియ్యం బస్తాలు సీజ్!
Advertisement

Rice Bags: ఖమ్మం పట్టణంలోని పలు కిరాణా, రైస్ స్టోర్ లలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించి 4 దుకాణాల నుంచి రూ. 96 వేల విలువైన 53 బియ్యం బస్తాలను సీజ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల సమయంలో బియ్యం బస్తాలపై ముద్రించిన బరువు కంటే తక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

బియ్యం బస్తాలు సీజ్..

నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అమలులో ఉన్న లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం సంబంధిత వ్యాపారులపై జరిమానా విధించడమే కాకుండా, తక్కువ బరువు ఉన్న బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా మామిళ్లగూడెంలోని లక్ష్మీ వేంకటేశ్వర కిరాణా & జనరల్ మర్చంట్ లో రూ. 18 వేల విలువుగల 12 బస్తాలు, శ్రీ లక్ష్మీ బాలాజీ కిరాణా & జనరల్ స్టోర్ లో రూ. 28,500 విలువుగల 15 బస్తాలు సీజ్ చేశారన్నారు. అలాగే కస్బా బజార్‌లోని షేక్ జానీమియా రైస్ స్టోర్స్ లో రూ. 7,500 విలువుగల 5 బస్తాలు, సుపీరియర్ ఎంటర్ ప్రైజెస్ లో రూ. 42 వేల విలువుగల 21 బియ్యం బస్తాలను అధికారులు సీజ్ చేశారన్నారు.

కఠిన చర్యలు..

Advertisement

జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. బియ్యం బస్తాలపై ముద్రించిన తూకం ప్రకారమే విక్రయాలు జరపాలని, తూకంలో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. వినియోగదారులకు సరైన పరిమాణంలో సరుకులు అందేలా చూడటానికి జిల్లాలోని వ్యాపారులందరూ అధికారుల తనిఖీలకు సహకరించాలని కోరారు.

Also read: హైదరాబాద్‌లో ఈ నెల 6 నుంచి 11 వరకు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

Tags

Related News

హైదరాబాద్‌లో ఈ నెల 6 నుంచి 11 వరకు ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు!

తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 5 భారీ ప్రాజెక్టులకు ఆమోదం!

‘బీజేపీ నేతలవి ఉత్త మాటలే’.. మోదీ, అమిత్ షాలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్!

DSP భీంరెడ్డి అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఇళ్లు, కార్లు, భూములు అటాచ్ చేసిన ఐటీ!

ధర్మపురి లో పుష్కరాల నిధుల రచ్చ.. ఇది అభివృద్ధా.. లేక మెరుగులా..?

కేటీఆర్ బ్లాక్‌మెయిలర్ రావుగా మారారు.. బల్మూరి వెంకట్ ఫైర్!

హైదరాబాద్‌లో భారీ గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు!

Big Stories

Advertisement
×