Charminar Traffic: దీపావళి వేడుకల నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విదించారు. నవంబర్ 6 నుంచి 11 వరకు ట్రాఫిక్ రద్దీకి అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. పండుగ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలిరానున్నట్టు అధికారులు అంచనా వేశారు.
దీంతో మదీనా నుంచి చార్మినార్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ ఎర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ముర్గీ చౌక్ నుంచి చార్మినార్ మార్గంలో రద్దీ ఉండనుంది. షా అలీ బండ నుంచి చార్మినార్ వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఎర్పడనుందని, ఈ రూట్లో ప్రయాణించిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచనలు చేశారు.
పండుగకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇందెకోసం ముఫీద్ ఉల్ అనమ్ స్కూల్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలని పోలీసులు తెలిపారు. చార్మినార్ బస్ టెర్మినల్, ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో పార్కింగ్ తో పాటు ఎంజే బ్రిడ్జి, సిటీ కాలేజ్, క్యూక్యూ స్టేడియంలో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, సైన్ బోర్డులు పాటించాలని విజ్ఞప్తి చేసారు. ట్రాఫిక్ సహాయం కోసం 9010203626 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.