Kannappa Movie : మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ కుమ్మరించి చేసిన కన్నప్ప మూవీ నిన్న (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చింది. సినిమా చూసిన తర్వాత ఒక్కో ఏరియా నుంచి ఒక్కో టాక్ వస్తుంది. కానీ, సినిమా యూనిట్ మాత్రం సక్సెస్ సెలబ్రెషన్స్ చేసుకుంటుంది. మొదటి రోజు వచ్చిన టాక్, కలెక్షన్లు, ఆ తర్వాత మూవీ టీం వేసిన ట్వీట్ గురించి ఇక్కడ చూద్దాం…
కన్నప్పపై దాదాపు 200 కోట్ల వరకు పోశారు మంచు ఫ్యామిలీ. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి బడా హీరోలు ఇందులో నటించారు. అన్నింటి కంటే, ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు. అందు వల్లే సినిమాపై ఇంత హైప్ క్రియేట్ అయింది. ఇది మంచు విష్ణుకు కూడా తెలుసు. అందుకే కన్నప్ప ప్రమోషనల్ కంటెంట్‌లో ప్రభాస్‌నే ఎక్కువ హైలైట్ చేసి చూపించాడు.
అందరూ అనుకున్నట్టు సినిమాకు జీవం పోసింది కూడా ప్రభాసే. పస్టాఫ్ మొత్తం స్లోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అలాంటి వేలోనే ఉన్నప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు థియేటర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. తర్వాత మళ్లీ ఎప్పటిలానే. ఇక ఫైనల్‌లో క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది.
ఇలాంటి సినిమాపై ఆడియన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫస్టాఫ్‌లోనే చాలా మంది ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటికి వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సినిమాలో ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన పార్ట్ అంటే… పైన చెప్పినట్టు ప్రభాస్ ఎపిసోడ్. అలాగే క్లైమాక్స్. ఈ రెండు మినహా సినిమా గురించి పాజిటివ్ గా చెప్పడానికి పెద్దగా ఏం లేదు.
ఇక ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మాట్లాడితే, ఇండియా వైడ్ 9.4 కోట్ల షేర్ వాల్యూ వచ్చినట్టు సమాచారం అందుతుంది. అలాగే వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 13 కోట్ల షేర్ వాల్యూ వచ్చినట్టు ఎస్టిమెట్ వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయి.. లాభాల బాట పట్టాలంటే 90 కోట్ల షేర్ రావాలి. మొదటి రోజే ఇంత తక్కువ కలెక్షన్లు వస్తే 90 కోట్లు రావాలంటే, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు పడుతుందో అని అంటున్నారు ట్రెడ్ పండితులు.
కానీ, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. అయితే, ఇక్కడ పోస్టర్‌ను చూసి ఓ పాజిటివ్ కోణం చూడొచ్చు. మంచు ఫ్యామిలీలో ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కన్నప్ప మూవీ కాస్త బెటర్ అనుకోవచ్చు. అప్పుడు ఇది ఇండస్ట్రీ హిట్ కాదు.. ఓన్లీ మంచు వారి హిట్ అని పెడితే సరిపోతుందనే కామెంట్స్ వస్తున్నాయి.
#Kannappa emerges as an Industry Hit 💥
An unstoppable saga of faith and power now ruling the silver screen! The divine has spoken — audiences have blessed it! 🙏🎟️ Book Now: https://t.co/ODH265TMRQ
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#KannappaInCinemas #KannappaMovie… pic.twitter.com/vd6ozeAEto— Kannappa The Movie (@kannappamovie) June 28, 2025