BigTV English

Prabhas: రాముడు.. కర్ణుడు.. రుద్రుడు.. నీ స్థాయి వేరు.. నీ స్థానం వేరు సామీ

Prabhas: రాముడు.. కర్ణుడు.. రుద్రుడు.. నీ స్థాయి వేరు.. నీ స్థానం వేరు సామీ

Prabhas: పౌరాణిక పాత్రల్లో కనిపించడం అందరి వలన కాదు. ఒక ఎన్టీఆర్.. ఒక ఏఎన్నార్.. ఒక కాంతారావు.. ఇక ఇప్పుడు ఒకే ఒక్క ప్రభాస్. ప్రస్తుతం ఈ మాటనే సోషల్ మీడియాలో అందరూ చెప్పుకొస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇది ఒక పేరు కాదు ఒక  బ్రాండ్. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి పుట్టిన ఒక కటౌట్. ప్రభాస్ ఎలాంటి పాత్రలోనైనా ఒదుగుతాడు అని చెప్పలేం కానీ.. పౌరాణిక పాత్రల్లో మాత్రం ప్రభాస్ సెట్ అయిన్నట్లు ఇంకెవ్వరు సెట్ అవ్వరు. బాహుబలి మహారాజుగా ఆ రాజసం, ఠీవి ఇంకెవరికి రావు. ఎన్ని ఏళ్ళు అయినా.. ఎంతమంది రాజులుగా కనిపించినా.. ఒరిజినల్ ఎప్పుడు ప్రభాస్ రాజునే గుర్తుకువస్తాడు.


 

ప్రస్తుతం ఇండస్ట్రీలో పౌరాణిక పాత్రలు అనగానే ప్రభాస్ మాత్రమే గుర్తొస్తాడు. పాత్ర ఏదైనా.. గెటప్ ఏదైనా.. డార్లింగ్ ఒక్కసారి అడుగుపెడితే అందరూ ఫిదా అవ్వాల్సిందే. యాక్షన్ సినిమాలు చేస్తున్న సమయంలో ఆదిపురుష్ సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు ప్రభాస్. అసలు డార్లింగ్ ఏంటి.. రాముడు ఏంటి.. ఆ లుక్ సెట్ అవ్వదేమో అని అందరూ పెదవి విరిచారు. ఇక రాముడి గెటప్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే షాక్ అయ్యిపోయారు. ఆ బాడీ, ముఖంలో ఆ తేజస్సు నిజంగా రాముడు ఇలానే ఉంటాడేమో అనిపించింది. విజయాపజయాలు, ట్రోల్స్ పక్కన పెడితే.. రాముడిగా మాత్రం ప్రభాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.


Anushka Shetty: ఢిల్లీకి భార్యగా స్వీటీ.. లోకేషూ.. నీకు గుడి కట్టినా తప్పులేదయ్యా

ఇక రామాయణం ముగిసింది అనుకుంటే.. డార్లింగ్ మహాభారతాన్ని చూపించాడు. కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు. మొదటి భాగం చూసినప్పుడు థియేటర్ లో అంత రెస్పాన్స్ ఏం రాలేదు. ఇక ఎప్పుడైతే రెండో భాగంలో డార్లింగ్.. ఆలస్యమైందా ఆచార్యపుత్రా అన్నాడో.. బాక్సాఫీస్ బద్దలైపోయింది. కర్ణుడిగా.. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ లో కనిపించాడు. అసలు పురాణాల్లో రాజులు నిజంగా ఇలానే ఉంటారా.. ? అనేంతలా ప్రతిసారి ప్రభాస్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. డార్లింగ్ ఎప్పుడు ఇలాంటి పాత్రల్లో కనిపించినా అది ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. కల్కికి హైలైట్ అంటే కర్ణుడే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

 

రామాయణంలో రాముడు, మహాభారతంలో కర్ణుడు  అయిపోయారు. ఇప్పుడు  రుద్రుడుగా అవతరమెత్తాడు ప్రభాస్. మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. విష్ణు అన్నా సినిమా ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అని అంటే దానికి కారణం ప్రభాస్. రుద్రుడుగా ప్రభాస్ గెటప్, నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలు డార్లింగ్ కోసమే కన్నప్ప సినిమాకు వెళ్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఏదిఏమైనా ఈ పాత్రలు చేయాలంటే మాత్రం అది ప్రభాస్ వలనే. ఇండస్ట్రీలో ఆయన స్థాయి వేరు. ఆయన స్థానం వేరు అని మరోసారి నిరూపించాడు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. అందుకే బాహుబలిలో జక్కన్న.. వాడు ఎక్కడున్నా రాజేరా అనే డైలాగ్ పెట్టి ఉంటాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

KishkindPuri event :బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఆ ముగ్గురు దర్శకులు హాజరు

Karishma Kapoor: మాజీ భర్త ఆస్తుల కోసం పిల్లలతో కలిసి కరిష్మ బడా ప్లాన్.. రూ.30 వేల కోట్లంటే మాటలా?

Telugu Film Industry: ఒంటరైన ఆడియో సంస్థ అధినేత… ఆ ఇద్దరు బడా ప్రొడ్యూసర్లతో పూర్తిగా చెడిందా ?

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Megastar Chiranjeevi : ఏంటి బాసు ఇప్పటికీ నీ గ్రేసు, కొంపదీసి టైం ట్రావెల్ మిషన్ దొరికిందా?

The Conjuring-Last Rites: హర్రర్ సీన్స్ వస్తుంటే జోకులు.. ‘కంజూరింగ్’ మూవీ థియేటర్‌లో కొట్టుకున్న జంటలు!

×