BigTV English

Mammootty: అస్వస్థతకు గురైన మమ్ముట్టి.. అసలు విషయంపై ఎంపీ క్లారిటీ!

Mammootty: అస్వస్థతకు గురైన మమ్ముట్టి.. అసలు విషయంపై ఎంపీ క్లారిటీ!

Mammootty Health Issue:: మలయాళం మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి (Mammooty గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు అని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. అయితే దీనిపై ఆయన పీ ఆర్ టీమ్ స్పందించి వార్తలను ఖండించింది. కానీ అంతలోపే రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ చేసిన కామెంట్లు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ..” మమ్ముట్టికి చిన్న ఆరోగ్య సమస్య ఉంది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని” ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు. ఇది విన్న నెటిజన్స్ నిజంగానే మమ్ముట్టి అస్వస్థతకు గురయ్యారా..? ఎంపీ చెప్పిన ఆ చిన్న సమస్య ఏమిటి? ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? అసలు ఎంపీ మాటలు వెనుక అర్థం ఏమిటి? అంటూ పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి దీనిపై ఎంపీ క్లారిటీగా స్పందిస్తారేమో చూడాలి.


మమ్ముట్టికి ఆరోగ్య సమస్యలు నిజమే – ఎంపీ జాన్ బ్రిట్టాస్

ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ మమ్ముట్టి స్నేహితుడు రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ (MP John brittas) తాజాగా మమ్ముట్టి ఆరోగ్య సమస్యలపై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..”మమ్ముట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనేది నిజం. అయితే కేవలం ఆయన చిన్న ఆరోగ్య సమస్యకు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఇప్పుడే నేను ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడాను. మేము ఎన్నో సంవత్సరాలుగా మంచి స్నేహితులం. కానీ ఎప్పుడు వ్యక్తిగత విషయాలను చర్చించుకోలేదు. కానీ ఇటీవల రోజుల్లో అలాంటి విషయాలను కూడా ఇప్పుడు పంచుకుంటున్నాము. ప్రస్తుతం ఆయన పూర్తి సంతోషంతో ఉన్నారు. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే మీ అభిమాన నటుడిని మీరు సెట్ లో చూస్తారు” అంటూ ఎంపీ స్పష్టం చేశారు. ఇక దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.


మమ్ముట్టి సినిమాలు..

మమ్ముట్టి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన మోహన్ లాల్ (Mohanlal) తో కలిసి మహేష్ నారాయణన్ (Mahesh Narayanan) దర్శకత్వంలో ఒక సినిమాలో మల్టీ స్టారర్ గా చేస్తున్నారు. ఇద్దరూ పెద్ద స్టార్స్ కావడంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా శ్రీలంకలో ప్రారంభమైంది. ప్రస్తుతం MMMN (మమ్ముట్టి, మోహన్ లాల్, మహేష్ నారాయణన్) అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార (Nayanthara), దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), కుంచాకో బోబన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడం వల్ల షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకోగా.. ఇప్పుడు మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టారు.

also read:Kannappa Pre release event: కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్.. ముఖ్య అతిథులు ఎవరంటే?

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×