BigTV English

Phone Tapping Case : ప్రభాకర్‌రావు అరెస్ట్? సిట్ సుప్రీం నిర్ణయం.. కేసీఆర్‌కు కష్టాలే?

Phone Tapping Case : ప్రభాకర్‌రావు అరెస్ట్? సిట్ సుప్రీం నిర్ణయం.. కేసీఆర్‌కు కష్టాలే?

Phone Tapping Case : నాలుగు సార్లు పిలిచారు. గంటల తరబడి సుదీర్ఘంగా విచారించారు. ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు? ఎందుకు చేశారు? ఎవరు చెబితే చేశారు? ఎవరి అనుమతి తీసుకున్నారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు. సిట్ ఎంతగా గుచ్చిగుచ్చి ఎంక్వైరీ చేస్తున్నా.. SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావు మాత్రం గమ్మునుంటున్నారట. తెలీదు.. గుర్తులేదు.. కాదు.. అవును.. ఇలా పొడిపొడి మాటలే మాట్లాడుతున్నారట. ఇక, ఇలా అయితే లాభం లేదని అనుకుంటున్న సిట్.. ప్రభాకర్‌రావును కస్టడీకి తీసుకోవాలని భావిస్తోంది. అరెస్ట్ దిశగా అడుగులు వేస్తోంది.


సుప్రీంకోర్టుకు సిట్?

ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు రక్షణ ఉంది. ఆ కండిషన్ మేరకే ప్రభాకర్‌రావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించింది కోర్టు. అందుకే ఇప్పటి వరకూ జరిగిన విచారణలో కింగ్ పిన్ సహకరించట్లేదనే కారణంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును సిట్ ఆశ్రయించనున్నట్టు సమాచాచరం. అంతేకాదు కస్టోడియల్ విచారణ కోసం నాంపల్లి కోర్టులోనూ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. ప్రభాకర్‌రావును అరెస్ట్ చేస్తే.. కస్టడీకి తీసుకుంటే.. ఇక నిజాలు రాబట్టడం మరింత ఈజీ అవుతుంది. అప్పుడిక ఆనాటి సీఎం కేసీఆర్‌ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకునే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్‌రావు అండ్ టీమ్.. వందలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారని చెబుతున్నారు.


ప్రభాకర్‌రావు వాళ్లను ఇరికిస్తున్నారా?

ఇక, విచారణలో ప్రభాకర్‌రావు తన అనుభవంతా యూజ్ చేసి చాకచక్యంగా సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. తాను ఏం చేసింది తన పైఅధికారులకు తెలుసంటూ ఈ కేసులో మరింత మందిని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. రివ్యూ కమిటీ పర్మిషన్ తీసుకునే తాను ఫోన్లు ట్యాప్ చేయించానని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆనాటి రివ్యూ కమిటీ సభ్యులను కూడా సిట్ విచారించింది. రివ్యూ కమిటీ సభ్యులైన ఆనాటి హోంశాఖ మాజీ సెక్రటరీ, ప్రస్తుత డీజీపీ జితేందర్‌తో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌ను ప్రశ్నించి వివరాలు సేకరించింది.

విచారణకు ఆ ఐపీఎస్‌లు..

ఫోన్ ట్యాపింగ్ కోసం టెలికాం సర్వీసులకి పంపిన నెంబర్లపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రభాకర్ రావు టీమ్ అప్పట్లో మావోయిస్టుల సానుభూతిపరులు అంటూ కొన్ని ఫోన్ నెంబర్లను ట్యాపింగ్‌కు సిఫారసు చేసినట్టు సమాచారం. వాటికి అనుమతులు ఎలా ఇచ్చారు? డీజీపీ జితేందర్, అనిల్ ఇచ్చిన వివరాల మేరకు ఆ స్టేట్‌మెంట్‌లను ధృవీకరించేందుకు గురువారం నాటి ప్రభాకర్‌రావు విచారణ కీలకంగా మారింది. త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్ స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

మావోయిస్టుల పేర్లు చెప్పి..

మావోయిస్టులకు మద్దతు, నిధులు సమకూరుస్తున్నారనే ఏకైక కారణంతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో వెలుగు చూస్తోంది. ఎన్నికలకు ముందు నెల రోజులు.. ఏకంగా 600 మంది ఫోన్ కాల్స్ చాటుగా విన్నారని తేలింది. అందులో ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి ఎన్నికల సర్వేలు చేసే సైదులు వరకు అనేకమంది పేర్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రభాకర్‌రావు అరెస్ట్ తప్పదా?

బుధవారం 8 గంటల పాటు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును ప్రశ్నించింది. ఆయన ఇచ్చిన సమాచారం, ఇప్పటి వరకూ వివిధ సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రభాకర్‌రావును గురువారం మరోసారి ప్రశ్నిస్తోంది. ఈ ఎంక్వైరీ అత్యంత కీలకమని తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన విచారణ వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచి.. ప్రభాకర్‌రావు కీలక నిందితుడని చెప్పి.. ఎంక్వైరీకి సహకరించట్లేదు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరేందుకు సిట్ సిద్ధమవుతోంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×