Kannappa Pre release event:మంచు విష్ణు (Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ కన్నప్ప’ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ తారాగణంతో.. అంతకుమించి భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకి కేరళలోని కొచ్చిలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఎప్పటిలాగే విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా కొన్ని పాత్రలు పేలవంగా ఉన్నాయి అని, అలాగే విష్ణు పాత్ర పై కూడా నెగిటివ్ కామెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth )కూడా రివ్యూ ఇచ్చారు.
ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ లు వీరే
ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్డేట్ వైరల్ గా మారింది. అదేంటంటే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ లాక్ చేశారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రజినీకాంత్, ప్రభాస్(Prabhas )తో పాటు.. ‘మహాభారతం’ సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషించిన కొంతమంది గెస్ట్ లుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండుగలా మారుతుంది అనడంలో సందేహం లేదు. మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కన్నప్ప సినిమా విశేషాలు..
కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh) దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ లాల్(Mohan Lal), ప్రభాస్, అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తోంది. బ్రహ్మానందం, మధుబాల, శివ బాలాజీ, సప్తగిరి వంటి వారు కూడా భాగమయ్యారు. పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జి నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ ఈ సినిమాకు కథను అందివ్వడం జరిగింది. స్టీఫెన్ దేవస్సి, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్న మంచు విష్ణు కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
అడుగడుగునా అవరోధాలే..
ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. దీనికి తోడు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల పోస్టర్లు విడుదల చేసినప్పుడు కూడా ట్రోల్స్ ఎదురయ్యాయి. ఆఖరికి ట్రైలర్ విషయంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. పైగా ఈ సినిమా హార్డ్ డిస్క్ ను కూడా దొంగతనం చేశారు. ఇలా అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Peddi Film: పెద్ది మూవీలో మీర్జాపూర్ నటుడు.. బుచ్చిబాబు ప్లాన్ అదుర్స్!