Watch Video : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కొందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొందరూ 1, 2 బంతుల్లోనే ఔట్ అవుతారు. మరికొందరూ బౌలింగ్ లో రాణిస్తే.. ఇంకొందరూ ఫీల్డింగ్ లో, కీపింగ్ లో.. స్టంప్స్ చేయడంలో, వికెట్లు తీయడంలో ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఫేమస్ అవుతుంటారు. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం. అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ నెంబర్ 3 ఆటగాడు అజహర్ అలీ ఫన్నీగా ఔట్ అయ్యాడు. దీంతో నెటిజన్లు ఇదేం బద్దకం రా.. ఇలా కూడా రన్ అవుట్ అవుతారా..? ఏది ఏమైనా అది పాకిస్తాన్ వల్లనే సాధ్యం అవుతుందని కొందరూ పేర్కొనడం గమనార్హం.
Also Read : Shubman Gill : లేడీ గెటప్ లో టీమిండియా కెప్టెన్ గిల్?
పాకిస్తాన్ జట్టు గతంలో పలు సందర్భాల్లో రనౌట్ అయింది. కానీ అబుదాబిలో షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అజర్ అలీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసిన అత్యంత అసాధారణమైన రనౌట్ లో ఒకటిగా నిలిచింది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ టిమ్ ఫైన్ రనౌన్ పూర్తి చేసిన వెంటనే అభిమానులు, ఆటగాళ్లు అంతా షాక్ అయ్యారని వెల్లడించారు. 52వ ఓవర్ లో పీటర్ సిడిల్ అజల్ అలీని థర్డ్ మ్యాన్ కి అందించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. బంతి బౌండరీకి చేరలేదని గ్రహించకుండానే ఇద్దరూ బ్యాట్స్ మెన్స్ పిచ్ మధ్యలో కబుర్లు చెప్పుకోవడం కనిపించింది. మిచెల్ స్టార్క్ బంతిని అందుకొని కెప్టెన్ టిమ్ ఫైన్ కి విసిరాడు. అతను వెంటనే బెయిల్ ను కొట్టాడు. ఇది అజార్ అలీకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వెరైటీ రనౌట్..
క్రికెట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో అస్సలు ఇలాంటి రన్ ఔట్ ఎవరు అయినా అవుతారా..? బంతి ఎక్కడ ఉంది.. అసలు బంతిని కూడా చూడకుండా క్రికెట్ ఆడుతున్నారా..? లేక కబుర్లు చెప్పుకుంటున్నారా..? అని కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు మరే ఇతర క్రికేటర్ రనౌట్ అవ్వని తరహాలో ఔట్ అయ్యాడు. పీటర్ సిడేల్ బౌలింగ్ చేసిన 53వ ఓవర్ లో మూడో బంతికి ఆఫ్ సైడ్ థర్డ్ మ్యాన్ దిశగా అజర్ అలీ షాట్ కొట్టాడు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా ఫీల్డర్ లేకపోవడంతో బంతి బౌండరీ దాటడం ఖఆయం అనుకున్నారు అంతా.. కనీ బౌండరీ లైన్ కి ముందే ఆగిపోవడాన్ని గ్రహించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్.. ఫీల్డర్ గా స్టార్క్ విసిరిన బంతిని వెంటనే అందుకున్న టిమ్ పెయిన్ బెయిల్స్ కొట్టాడు. ఈ సందర్భంలో అజర్ అలీ, నాన్ స్ట్రైక్ బ్యాట్స్ మెన్లు మధ్యలోనే ముచ్చట్లు పెట్టడం విశేషం. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడం విశేషం.
Hilarious run out of all time! 😂 pic.twitter.com/8pYEsh3k25
— Out Of Context Cricket (@GemsOfCricket) June 19, 2025