E-Paper
Advertisement

చచ్చినా వదలని ప్రేమ మత్తు… కుక్క సాయంతో ప్రేయసికి చేరువగా… ది బాప్ ఆఫ్ ఎమోషనల్ రైడ్

చచ్చినా వదలని ప్రేమ మత్తు… కుక్క సాయంతో ప్రేయసికి చేరువగా… ది బాప్ ఆఫ్ ఎమోషనల్ రైడ్
Advertisement

Malayalam Fantasy Drama: ఫాంటసీ, ప్యూర్ లవ్ స్టోరీస్ మిక్స్ చేసి తీసే సినిమాలకు మన సౌత్ లో ఎప్పుడూ ఒక క్రేజీ డిమాండ్ ఉంటుంది. ఇదే కంటెంట్ తో కేరళలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఒక మూవీ ఎమోషనల్ హిట్ గా నిలిచింది. మనసులోని ప్రేమను చెప్పకముందే ప్రాణాలు పోతే.. ఆ చివరి కోరికను నెరవేర్చుకోవడానికి ఆత్మ చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయనే ఆసక్తికరమైన ఫాంటసీ పాయింట్‌ కు ప్రేమ, కుటుంబ అనుబంధాలు, పెంపుడు జంతువులపై ఉండే ఆప్యాయతను జోడించి తెరకెక్కించారు. ఈ మలయాళ సినిమా పేరు ‘Anugraheethan Antony’. 2021లో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ రూపంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? మరి చనిపోయిన తర్వాత కూడా తన ప్రేమను చేరుకోవాలని తపించిన ఆంటోనీ కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆంటోనీ (సన్నీ వేన్) ఒక సంతోషంగా, బాధ్యత లేకుండా తనకు నచ్చినట్లు జీవించే కుర్రాడు. అతడి తండ్రి వర్గీస్ మాష్ (సిద్దిఖ్) ఒక రిటైర్డ్ టీచర్. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన ఆయన, ఆంటోనీకి బాధ్యత నేర్పించాలనే ఉద్దేశంతో ఇంటికి రెండు కుక్కపిల్లలను తీసుకొస్తాడు. అయితే ఆంటోనీకి మాత్రం అవంటే అస్సలు ఇష్టం ఉండదు. వాటిని ఇబ్బంది పెడుతూ, తండ్రితో గొడవ పడుతుంటాడు. చివరికి రూబీ అనే కుక్కను తండ్రికి చెప్పకుండా మరొకరికి అమ్మేస్తాడు. మరోవైపు రోనీ అనే కుక్క మాత్రం తండ్రికి తోడుగా ఇంట్లోనే ఉంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే, ఆంటోనీ జీవితంలోకి సంజన (గౌరీ కిషన్) ప్రవేశిస్తుంది. ఆమెను చూసినప్పటి నుంచి ఆంటోనీ మనసులో ప్రేమ మొదలవుతుంది. తన ప్రేమను ఆమెకు చెప్పాలని అనుకుంటాడు. కానీ ఆ కోరిక నెరవేరకముందే ఒక ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోతాడు. అయితే అతడి ఆత్మ మాత్రం ఈ లోకాన్ని విడిచి వెళ్లలేక అక్కడే ఉండిపోతుంది. బతికున్న వాళ్లతో మాట్లాడలేడు, తన ఉనికిని కూడా ఎవరికీ తెలియజేయలేడు. అతడిని చూడగలిగేది ఒక్క రోనీ మాత్రమే!

ఇక్కడి నుంచి కథలో అసలైన ఎమోషనల్ జర్నీ మొదలవుతుంది. చనిపోయిన తర్వాత ఆత్మలు భూమిపై ఏడు రోజులు మాత్రమే ఉండగలవని ఆంటోనీకి తెలుస్తుంది. ఈలోగా తన మరణవార్తను సంజనకు తెలియజేయాలి. ఆమెకు తనపై ఉన్న ప్రేమను అర్థమయ్యేలా చేయాలి. అదే సమయంలో తన మరణంతో బాధపడుతున్న తండ్రికి కూడా తోడుగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఇవన్నీ చేయడానికి అతడికి ఉన్న ఏకైక సహాయం రోనీ. మరి ఆ కుక్క సాయంతో ఆంటోనీ తన చివరి కోరికను ఎలా నెరవేర్చుకున్నాడు? రోనీ తన యజమాని కొడుకు కోసం చేసిన పని ఏంటి? ఆంటోనీ ఆత్మ చివరకు ఏమైంది? అనేది సినిమాలో చూడాలి. ఇందులో మనుషులు చెప్పలేని భావాలను ఒక మూగజీవం ఎలా అర్థం చేసుకుంటుందో చూపించిన తీరు ప్రేక్షకులను కదిలిస్తుంది.

తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

ఈ సినిమాలో ఆంటోనీగా సన్నీ వేన్, సంజనగా గౌరీ కిషన్ నటించారు. ఆంటోనీ తండ్రి వర్గీస్ మాష్ పాత్రలో సిద్దిఖ్, సంజన తండ్రి మాధవన్‌గా ఇంద్రన్స్ కనిపిస్తారు. సూరజ్ వెంజరమూడు, బైజు సంతోష్, షైన్ టామ్ చాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రిన్స్ జాయ్ దర్శకత్వం వహించగా, అరుణ్ మురళీధరన్ సంగీతం సమకూర్చారు. సుమారు 1 గంట 59 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2021 ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ వెర్షన్ ETV Winలో అందుబాటులో ఉంది.

Read Also: బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

Tags

Related News

అప్పుడే ఓటీటీలోకి రాబోతున్న జెన్ జీ మెచ్చిన మూవీ.. ఏది? ఎక్కడంటే?

ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ

కళ్ళు తెరిచి చూస్తే నిజమైన గేమ్‌లో… కానీ రియల్ లైఫ్‌లో నరకం… డార్క్ యాక్షన్ సిరీస్

పవిత్రమైన చెట్టును నరికిన మూడ్రోజులకే ఇంటి పెద్ద మృతి… 16 రోజుల్లో ఐదుగురి చావులు… నవ్విస్తూ భయపెట్టే మలయాళ థ్రిల్లర్

చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్

బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

Big Stories

Advertisement
×