E-Paper
Advertisement

వాయు కాలుష్యానికి చెక్ పెట్టే..అడ్వాన్స్‌డ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!

వాయు కాలుష్యానికి చెక్ పెట్టే..అడ్వాన్స్‌డ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!
Advertisement

Best air purifiers in India: ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం అనేది.. మన ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తోంది. బయట తిరిగినప్పుడు మాత్రమే కాదు.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం పీల్చే గాలి ఎంత శుభ్రంగా ఉందనేది మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నగరాల్లో గాలి క్వాలిటీ పడిపోతున్న తరుణంలో.. ఇళ్లలో ‘ఎయిర్ ప్యూరిఫైయర్స్’వాడకం విపరీతంగా పెరిగింది. మార్కెట్లో అనేక రకాల బ్రాండ్లు ఉన్నప్పటికీ, కొన్ని లేటెస్ట్ ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ప్యూరిఫైయర్లు కస్టమర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. కొన్ని టాప్ ఎయిర్ ప్యూరిఫైయర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1.డైసన్ ప్యూరిఫైయర్ కూల్ :

టెక్నాలజీ, డిజైన్ విషయంలో.. డైసన్ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.ఈ ప్యూరిఫైయర్ కేవలం గాలిని శుభ్రం చేయడమే కాకుండా..వేసవిలో రూమ్స్ చల్లని గాలితో రిఫ్రెష్ చేస్తుంది. ఇందులో ..ఉండే 360-డిగ్రీ హెపా , ఆక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు గాలిలోని 99.97% సూక్ష్మ కాలుష్య కణాలను, హానికరమైన వాయువులను సమర్థవంతంగా.. తొలగిస్తాయి. ఎల్‌సీడీ డిస్‌ప్లే ద్వారా.. గాలి క్వాలిటీ లైవ్‌లో చూపించడమే కాకుండా..డైసన్ లింక్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచి దీన్ని ఈజీగా కంట్రోల్ చేయెచ్చు.

Advertisement

సుమారు ధర: ఫీచర్లను బట్టి రూ.39,990 నుంచి రూ.45,000 వరకు ఉంటుంది.

2. Praan Hive Air Purifier:

స్టార్టప్ కంపెనీ అయిన ‘ప్రాణ్’ తయారు చేసిన ఈ హైవ్ ఎయిర్ ప్యూరిఫైయర్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక రూమ్ కు మాత్రమే పరిమితం కాకుండా.. పెద్ద హాల్స్ లేదా ఆఫీసులకు సరి పోయేలా అత్యంత వేగంగా గాలిని శుభ్రం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి గాలిలోని మలినాలను అంచనా వేసి ఆటోమేటిక్‌గా శుభ్ర పరుస్తుంది. దీని మోడ్రన్, ప్రీమియం డిజైన్ ఇంటి.. ఇంటీరియర్‌కు చక్కటి లుక్ తీసుకు వస్తుంది.

Advertisement

సుమారు ధర:సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు లభిస్తుంది.

3.ప్రముఖ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్:

డైసన్, ప్రాణ్ హైవ్‌లతో.. పాటు మార్కెట్లో మరికొన్ని బ్రాండ్లు కూడా మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి.

Xiaomi Smart Air Purifier 4: కాంపాక్ట్ సైజులో లభించే.. ఈ ప్యూరిఫైయర్ చిన్న , మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పర్ఫెక్ట్‌గా సరి పోతుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉంటుంది. దీని ధర సుమారు రూ. 13,999 వరకు ఉంటుంది.

Philips AC1215 / AC2887: ఫిలిప్స్ బ్రాండ్ ఎయిర్ ప్యూరిఫైయర్లు.. నమ్మకమైన పని తీరును ఇస్తాయి. రంగుల ఆధారంగా గాలి క్వాలిటీ సూచించే ఏక్యూఐ ఇండికేటర్ ఇందులో.. ఉంటుంది. దీని ధర సుమారు రూ.9,999 నుంచి రూ.14,999 మధ్య ఉంటుంది.

Also Read : మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

సరైన ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంచుకోవడం ఎలా?

మీ అవసరాలకు తగిన ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

రూమ్ సైజ్ :మీ రూమ్ విస్తీర్ణం ఎంత ఉందో చూసుకుని, దానికి సరి పోయే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవాలి.

ట్రూ హెపా ఫిల్టర్:గాలిలోని దుమ్ము, ధూళి, వైరస్‌లను అడ్డుకోవడంలో ట్రూ హెపా ఫిల్టర్ అత్యంత కీలకం.

మెయింటెనెన్స్: ఫిల్టర్ మార్చే ఖర్చును ముందే చెక్ చేయడం మంచిది.

Related News

తక్కువ ధరలో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనాలా?వీటిని మించినవి లేవు!

కొత్త 5G ఫోన్ నెట్‌వర్క్ సమస్యలకు..చెక్ పెట్టే సింపుల్ టిప్స్!

మీ వాట్సాప్ ప్రైవసీ సేఫ్..చాట్ లాక్ ఫీచర్‌ని ఇలా వాడండి!

తక్కువ సిబిల్ స్కోరు.. మీ లోన్ రిజెక్ట్ చేస్తుందా?ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

మొదటి సారి వ్లాగ్స్ చేస్తున్నారా?పర్ఫెక్ట్ కెమెరా, మైక్ ఎంచుకోవడం ఎలా?

దీపావళికి పర్ఫెక్ట్ ఫోటోలు తీయాలా? ఫోన్‌లో ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే సరి

సోనీ నుంచి అదిరిపోయే నోస్టాల్జియా గాడ్జెట్..MDR-3R హెడ్‌ఫోన్స్ లాంచ్

Big Stories

Advertisement
×