E-Paper
Advertisement

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!
Advertisement

VrushaKarma trailer:గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) చివరిగా తండేల్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు పాత్రతో పాటు కథకి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతూ మరో డిఫరెంట్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘వృషకర్మ’ ఇందులో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాకి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

వృషకర్మ ట్రైలర్ రిలీజ్..

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన మేకర్స్ నవంబర్ 25వ తేదీన సాయంత్రం 5:00 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని అంచనాలు పెంచేశారు. కానీ అనూహ్యంగా నవంబర్ 26న కాసేపటి క్రితం ట్రైలర్ విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ట్రైలర్ విడుదల ఆలస్యమైనప్పటికీ ట్రైలర్ విజువల్స్, యాక్షన్ పెర్ఫార్మెన్స్, సైన్స్ కే సవాలు విసిరేలా ఉన్న మూఢ నమ్మకాలు, తాంత్రిక శక్తులు అన్నీ కూడా ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేశాయి.

భయపెడుతున్న ట్రైలర్..

Advertisement

ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ మొదలవ్వగానే మనకు కాస్త విరూపాక్ష మూవీలోని సన్నివేశాలను చూసినట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే.. “అతీంద్రియ శక్తి తన బలిని ఎంచుకుంది” అంటూ డైలాగ్ చెబుతూ చిన్నారిని చూపిస్తారు. ఇక తర్వాత ఆ పాపను ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. “తవ్వకాలలో బయటపడ్డ ఆ గుహలో ఐదు వేల సంవత్సరాల నాటి కొన్ని గార్వింగ్స్ కనిపించాయి” అనే డైలాగు వినిపిస్తుంది . ఆ తర్వాత మీనాక్షి తన బృందంతో కలిసి నాగచైతన్యను మీట్ అవుతారు. నాకు మీ సహాయం కావాలి అంటూ నాగచైతన్యను అడగగా అప్పుడు ఆయన ఇంట్రడక్షన్ చూపిస్తారు. ఆ గుహలో ఉన్న గార్వింగ్స్ ని చూసి నాగచైతన్య రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తర్వాత తాంత్రిక విద్య, శక్తులను చూపించారు. మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఒక అతీంద్రియ శక్తి భూమిపై తిష్ట వేసింది అంటూ చూపించే దృశ్యాలు విజువల్స్ భయానకంగా మారాయి. సైన్స్ కే సవాలు విసిరేలా ఉన్న అతీంద్రియ శక్తులను నాగచైతన్య ఎలా ఎదుర్కొన్నారు? ఇందులో మీనాక్షి పాత్ర ఏంటి? తదితర విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా ట్రైలర్ తోనే ఇంత భయం పుట్టిస్తున్నారంటే సినిమాతో ఇంకెంత భయపెడతారో అంటూ ట్రైలర్ చూసిన ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో నాగచైతన్య మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారని ఆడియన్స్ తో పాటు అభిమానులు గట్టిగా చెబుతున్నారు.

ALSO READ:గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

పాటలు ఉండవు.. నో లవ్ స్టోరీ – నాగ చైతన్య

Advertisement

పైగా ఈ సినిమాలో పాటలు, లవ్ స్టోరీ లాంటివి లేకుండా సినిమా చూసినంతసేపు ఊపిరి బిగబట్టి మరీ సినిమా చూసేలా మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో నాగచైతన్య చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ చూస్తేనే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అప్పుడే సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

 

Related News

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!

చూపు తిప్పుకోనివ్వని మహిమా..ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందేంటి బాసూ!

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!

Big Stories

Advertisement
×