Best Tourist Place: ప్రకృతి సోయగాలు, పచ్చని అడవి అందాలు, వన్యమృగాల సంచారం.. మొత్తంగా.. మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతం మొత్తం.. ఇక్కడికి వచ్చే వారికి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. అడవి అందాలను చూస్తూ.. పర్యాటకులు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. సకల సౌకర్యాలతో కూడిన మార్నింగ్, ఈవెనింగ్ సఫారీలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయ్. అటవీశాఖ ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్లి.. జింకలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పక్షుల చప్పుళ్ల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ.. కొత్తగా అనుభూతి చెందుతున్నారు.
ఒక్క తెలంగాణ నుంచే కాదు.. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. ఇక్కడ టూరిస్టుల కోసం రిసార్టులు, ఫారెస్ట్ మ్యూజియం లాంటి అనేక సదుపాయాలున్నాయి. ఇక్కడి సఫారీ టూర్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అడవి జంతువులను.. ఇంత దగ్గరగా చూడటం.. అద్భుతమైన అనుభూతి అంటున్నారు. ప్రకృతి అందాల మధ్య.. ఫ్యామిలీతో.. వీకెండ్‌లో ఎంజాయ్ చేయడం బాగుందని చెబుతున్నారు టూరిస్టులు.
కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో.. ఉదయం పూట సఫారీ తొమ్మిదిన్నరకు మొదలవుతుంది. మధ్యాహ్నం మూడున్నర, సాయంత్రం ఐదున్నరకు సఫారీ టూర్ ఉంటుంది. ఈ అడవిలో ఉండే వివిధ రకాల జంతువుల్ని చూసేందుకు.. ఎక్కడెక్కడి నుంచే టూరిస్టులు వస్తున్నారు. వైల్డ్ లైఫ్‌ని చూసి.. ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు.
ప్రస్తుతం.. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలని కలుపుకొని.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ విస్తరించి ఉంది. జన్నారం మండలం కవ్వాల్ అభయారణ్యంలో.. అపారమైన వృక్ష సంపదతో పాటు వివిధ రకాల జంతువులు, ఔషధాలు, మొక్కలు, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని చూసేందుకు వస్తున్న టూరిస్టుల కోసమే.. అటవీశాఖ నుంచి సఫారీ టూర్ ఏర్పాటు చేశామంటున్నారు.
Also Read: అక్కడ ప్రతి చదరపు మీటరుకు ఒక పాము, మనిషి అడుగుపెడితే బతకడం కష్టమే
కవ్వాల్ అభయారణ్యానికి వచ్చే పర్యాటకులు.. ఇక్కడి ప్రకృతి అందాలని చూసి.. ఎంతో మానసిక ప్రశాంతత పొందుతున్నారు. రాబోయే రోజుల్లో.. టూరిస్టుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వారికి కావాల్సిన సదుపాయాలన్నింటిని.. సమకూరుస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.