BigTV English

Kota Srinivas Rao Demise: కోటా మరణం.. సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల సంతాపం!

Kota Srinivas Rao Demise: కోటా మరణం.. సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల సంతాపం!

Kota Srinivas Rao Demise:కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) .. దిగ్గజ నటులుగా పేరు సొంతం చేసుకున్న ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున తన నివాసంలో 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు మరణం సినీ ఇండస్ట్రీని, అటు రాజకీయ పరిశ్రమను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే సినీ, రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా విచారణ వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రిలతోపాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని మొదలుకొని చాలామంది హీరోలు, కమెడియన్లు ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ద్వారా కోటా శ్రీనివాసరావు మరణం పై స్పందిస్తున్నారు. ఇక ఎవరెవరు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారో ఇప్పుడు చూద్దాం.


కోటా శ్రీనివాసరావు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..

కోటా శ్రీనివాసరావు మృతి పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.. “వైవిద్య భరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోటా శ్రీనివాసరావు మరణం విచారకరం. సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన విశిష్ట సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారు.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.


కోటా శ్రీనివాసరావు మృతి పై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోటా శ్రీనివాసరావు మరణం పై స్పందించారు.. “ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన మృతి సినీ రంగానికి తీరనిలోటు.చలన చిత్ర పరిశ్రమకు, ఆయన లేని లోటు తీర్చలేనిది.
భౌతికంగా కోట గారు మన మధ్య లేకపోయినా…ఆయన పోషించిన విభిన్న పాత్రలతో…తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ…కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ తెలిపారు.

కోటా శ్రీనివాసరావు మృతి పై మాజీ సీఎం జగన్ సంతాపం..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోట శ్రీనివాసరావు మరణం పై విచారణ వ్యక్తం చేశారు. “ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విల‌క్ష‌ణ‌మైన‌ పాత్ర‌ల్లో న‌టించి, మెప్పించిన ఆయ‌న‌ను ప‌ద్మ‌శ్రీతో పాటు ఎన్నో అవార్డులు వ‌రించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ నివాళులు.”అంటూ తెలిపారు.

కోటా శ్రీనివాసరావు మృతి పై మాజీ సీఎం కేసీఆర్ సంతాపం..

అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట శ్రీనివాసరావు మృతి పై స్పందిస్తూ..”విభిన్న పాత్రలను పోషించిన విలక్షణ వెండితెర నటుడు.. ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. కోటా మరణంతో సినీ రంగం ఒక గొప్ప నటుడుని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ తెలిపారు.

కోటా శ్రీనివాసరావు మరణంపై చిరంజీవి కన్నీళ్లు..

కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సంతాపం వ్యక్తం చేశారు.”లెజెండ్రీ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ఆయన, నేను ఒకేసారి సినిమా కెరియర్ ను ప్రారంభించాము. కామెడీ, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్ ఇలా ఏ పాత్రైనా సరే ఆయన మాత్రమే చేయగలడు అన్న గొప్పగా నటించారు. కోటా శ్రీనివాసరావు లేని లోటు చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ తీరనిది” అంటూ తెలిపారు.

కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్..

కోటా శ్రీనివాసరావు మృతదేహాన్ని నటుడు బ్రహ్మానందం(Brahmanandam) సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కోటా శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బ్రహ్మానందం తో పాటు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కూడా కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.

సినీ పరిశ్రమ కోట కూలిపోయింది – తనికెళ్ల భరణి

కోటా శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులర్పించిన తనికెళ్ల భరణి ( Thanikella Bharani).. అనంతరం మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమ కోట కూలిపోయింది. సామాన్య మధ్య తరగతిలో పుట్టి.. అంచెలంచలుగా సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

ALSO READ:Kota Srinivas Rao Last Rights: ముగిసిన శకం.. మహాప్రస్థానంలో నేడే అంత్యక్రియలు!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×