BigTV English

IRCTC train tour: ప్రతీ భారతీయుడు ఎక్కాల్సిన ట్రైన్ సిద్ధం.. 10 రోజుల యాత్రకు రెడీనా! స్పెషల్ ఏంటంటే?

IRCTC train tour: ప్రతీ భారతీయుడు ఎక్కాల్సిన ట్రైన్ సిద్ధం.. 10 రోజుల యాత్రకు రెడీనా! స్పెషల్ ఏంటంటే?

IRCTC train tour: అసలే ఆగస్ట్ 15 రాబోతోంది. ప్రతి భారతీయుడు సగర్వంగా ఎన్నో గొప్పలు చెప్పుకొనే రోజు ఇది. అందుకే దేశభక్తి గల ప్రతి పౌరుడి కోరిక మేరకు ఇండియన్ రైల్వే సరికొత్త టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ పూర్తి చేశారంటే.. చివరగా మేరా భారత్ మహాన్ అంటూ గట్టిగా నినదిస్తారు. అలాంటి టూర్ ప్యాకేజీని మన కోసం రైల్వే తీసుకువచ్చింది. అసలు ఆ ప్యాకేజీ విశేషాలేమిటో తప్పక తెలుసుకోండి.


వందేళ్ల వెనకటి త్యాగాలను ఓసారి తిరిగి చూడాలని మీకు అనిపించిందా? స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని ఉందా? అయితే ఈ రైలు మీ కోసమే! దేశభక్తిని గుండెల్లో ఉంచుకుని, చరిత్రను సాక్షాత్కరించేందుకు భారత రైల్వే ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణిమ్ భారత్ యాత్ర అనే 10 రోజుల రైలు ప్రయాణం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది కేవలం ఓ టూర్ కాదు.. దేశ గౌరవాన్ని అందరూ అనుభవించేలా చేసే ఒక స్ఫూర్తిదాయకమైన యాత్ర.

దేశ చరిత్రను నడిచి తెలుసుకునే అవకాశం!
IRCTC టూరిజం ఆధ్వర్యంలో ఈ దేశభక్తి యాత్ర ఆగస్టు 14న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతోంది. యాత్ర మొత్తం 9 నైట్‌లు, 10 రోజులు సాగుతుంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్, మొధెరా, పాటన్, కేవడియా (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ), పుణె, ఔరంగాబాద్, ఖజురాహో, ఝాన్సీ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు.


టికెట్ ధరల వివరాలు.. మీ బడ్జెట్‌కు తగ్గట్టే!
ఈ యాత్రను ప్రతి మధ్యతరగతి భారతీయుడు పూర్తి చేయగలిగే రీతిలో టికెట్ ధరలను ఇండియన్ రైల్వే ప్రకటించింది. ప్రతి వ్యక్తికి సెకండ్ AC క్లాస్ రూ. 32500, థర్డ్ AC క్లాస్ రూ. 28,200 గా ధరలను నిర్ణయించారు. ఈ ధరల్లో తిండి, బస, గైడ్ సేవలు, AC వాహనాల్లో స్థానిక సైట్‌సీయింగ్, ప్రయాణ భీమా వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి, లేదా విద్యార్థులుగా, లేదా సీనియర్ సిటిజన్లుగా ఈ యాత్ర చేయాలనుకునే వారికి ఇది అత్యుత్తమమైన చారిత్రక అవకాశం.

Also Read: Viral video of railway: ట్రాక్ పై రన్నింగ్ లో ట్రైన్.. పందెం కాసి మరీ పట్టాలపై యువకుడు.. వీడియో వైరల్!

ప్రయాణంలో సందర్శించే ప్రదేశాలు.. ప్రతి అడుగూ గర్వకారణం!
ఈ యాత్రలో భాగంగా పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం, పాట్నా లోని పురాతన హిందూ దేవాలయ సంపద, కేవడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పుణె లోని ఆగా ఖాన్ ప్యాలెస్, భీమశంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్ లోని అజంతా-ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఖజురాహో, ఝాన్సీ లాంటి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు.

ఇది కేవలం ప్రయాణం కాదు సుమా!
ఈ యాత్రలో భాగంగా గైడ్‌ల ద్వారా చరిత్రకు సంబంధించిన వివరాలు వివరిస్తారు. ప్రతి చోట ఓ త్యాగాన్ని, ఓ పోరాటాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించగలుగుతాం. స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువత, కుటుంబ పెద్దలు ఇలా అందరూ ఈ టూర్‌లో చేరితే మన తరం వారికి చరిత్రను గౌరవించడమే కాదు, దేశాన్ని ప్రేమించడమంటే ఏంటో తెలుస్తుంది.

బోర్డింగ్ ఎక్కడెక్కడ?
ఈ ప్రత్యేక రైలులో ఎక్కే అవకాశం ఉత్తర భారతదేశంలోని పలు నగరాలకు ఉంది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్, గుర్గావ్, రేవారి, రింగస్, ఫులేరా, అజ్మీర్ స్టేషన్లకు ఈ సదుపాయం ఉంది.

సదుపాయాలు
ప్రతి ప్రయాణికుడికి స్వచ్ఛమైన శాకాహారి ఆహారం, AC కోచుల్లో వసతి, AC బస్సుల్లో సైట్‌సీయింగ్, బీమా కవరేజ్, ప్రతి ప్రదేశానికి గైడ్ వంటి అన్ని వసతులు లభిస్తాయి. ఇంతకీ, రూ. 30 వేలు ఖర్చుపెట్టి దేశ చరిత్రను తెలుసుకునేలా చేసే మరో అవకాశం మన జీవితంలో తిరిగి వస్తుందా? ఆలస్యం ఎందుకు ఇప్పుడే టికెట్ బుక్ చేయండి.

IRCTC టూరిజం ద్వారా బుకింగ్ ఎలా చేయాలి?
IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేయొచ్చు. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. త్వరగా బుక్ చేసుకోకపోతే, స్థానాలు భర్తీ అయ్యే ప్రమాదం ఉంది.

ప్రతి భారతీయుడు ఎక్కాల్సిన ట్రైన్ ఇదే!
ఇది ఫోటోలు తీసే ట్రిప్ కాదు.. దేశాన్ని పునఃస్మరించుకునే గౌరవ యాత్ర. మన తరం త్యాగాల విలువను తెలుసుకుని, స్వేచ్ఛను గుర్తు చేసుకునే ఆధ్యాత్మికమైన దేశభక్తి పయనం. మన జీవితంలో కనీసం ఒక్కసారి ఇలా దేశ చరిత్రను చూసే ఛాన్స్ అందరూ పొందాలి. కనుక, మన జెండా ఎగురేసే వేళ, మన గుండెను గర్వంతో నింపుకునేలా ఈ స్వర్ణిమ్ భారత్ యాత్రలో అడుగు పెట్టండి!

Related News

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Big Stories

×