OTT Movie : మలయాళ సినీ పరిశ్రమలో అజయ్ కుమార్ అలియాస్ గిన్నిస్ పక్రూ అత్యంత పొట్టి నటుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. 64 సెం.మీ. ఎత్తుతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇతను రీసెంట్ గా కథానాయకుడిగా నటించిన ఒక మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘916 Kunjoottan’ 2025లో విడుదలైన మలయాళం థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ, డ్రామా మూవీ. దీన్ని ఆర్యన్ విజయ్ తన డైరెక్టోరియల్ డెబ్యూలో తెరకెక్కించాడు. ఇందులో గిన్నిస్ పక్రూ, టినీ టామ్, రాకేష్ సుబ్రమణ్యన్, దయ్యనా హమీద్, నియా వర్గీస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మోర్జ్ డ్రాగన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాకేష్ సుబ్రమణ్యన్ నిర్మించాడు. మోహన్‌లాల్ 2023 అక్టోబర్ 23న టైటిల్ లోగోను లాంచ్ చేశాడు. కొడుంగల్లూర్, ఇరింజలకుడలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 2025 మే 23న థియేటర్లలో ఈసినిమా విడుదలైంది. Amazon Prime Video లో జులై 11 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది.
స్టోరీలోకి వెళితే
సిద్ధార్థ్ ను అందరూ ప్రేమగా “కుంజూట్టన్” అని పిలుస్తుంటారు. ఇతను శారీరకంగా మూడు అడుగులు ఉన్నా మనసులో గొప్ప వ్యక్తిత్వం కలిగిఉంటాడు. అతను రెండు వ్యాపారాలను బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఒకటి తన ఊరిలో సాధారణ టీ షాప్ ఓనర్‌గా, రెండోది సిటీలో , కన్నింగ్ బిజినెస్‌మ్యాన్‌గా (అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ కూడా). ఈ రెండు అతని జీవన విధానాన్ని వేరుగా ఉంచుతాయి. అయితే డబ్బులు బాగానే ఉన్నా అతని హైట్ చూసి పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఒక అమ్మాయిని ఆటను ఇష్టపడితే తనకి ఇదివరకే పెళ్లికూడా జరిగి ఉంటుంది. ఈ క్రమంలో కథలో ఒక ట్విస్ట్ వస్తుంది. ఒక మ్యారేజ్ ప్రపోజల్ ద్వారా వైష్ణవి అనే అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది.
అయితే పెళ్ళి జరిగినా మొదటి రాత్రి జరగక పాపం పిల్లాడు ఇబ్బంది పడుతుంటాడు. ఈ సంఘటనలు సిద్ధార్థ్ జీవితంలో ఎమోషనల్ గా ఒక గందరగోళాన్ని ఎదుర్కొంటాడు. ఆమెతో ఇక బలవంతంగా మూవ్ అవ్వాలనుకుంటాడు. అయితే వైష్ణవి అతనితో గొడవపడి వెళ్ళిపోతుంది. ఆమె ఎందుకు అలా చేస్తుందో తెలిసి సిద్ధార్థ్ షాక్ అవుతాడు. ఇంతకీ వైష్ణవి ఎందుకు సిద్ధార్థ్ ను దగ్గరికి తీసుకోకుండా ఉంటుంది ? సిద్ధార్థ్ తెలుసుకున్న రహస్యం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : ఈ లేడీ సైకో ఎంతకు తెగిచింది భయ్యా ? బతికుండగానే చర్మాన్ని వలిచి టార్చర్… ఒక్కో ట్విస్ట్ కు గుండె గుభేల్