BigTV English

Sekhar Kammula: శేఖర్ కమ్ముల రింగులు జుట్టు వెనక స్టోరీ ఇదే

Sekhar Kammula: శేఖర్ కమ్ముల రింగులు జుట్టు వెనక స్టోరీ ఇదే

Sekhar Kammula: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా కూడా అవార్డులు సాధించింది. ఆ సినిమా తర్వాత ఎన్నో కష్టాలు పడి ఆనంద్ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకు వెళ్లారు. అనామిక సినిమా మినహాయిస్తే శేఖర్ కమ్ముల కెరియర్లో చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ సాధించుకున్నాయి. కొన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా కూడా ఇదేంటి ఇలా తీసాడు అని మాత్రం అనిపించుకోలేదు.


రింగులు జుట్టు వెనక రహస్యం

ఇకపోతే శేఖర్ కమ్ములను చూడగానే చాలామందికి బక్క పల్చగా ఉన్న శరీరం. రింగు రింగులు జుట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రింగులు జుట్టు వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ రివీల్ చేశాడు నాగచైతన్య. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా జరుగుతున్న తరుణంలో మానిటర్ వైపు చూస్తూ తల పైన చేయి వేసుకొని జుట్టును అలా తిప్పుతూ ఉండేవారట శేఖర్. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అయితే దీనికి ఆన్సర్ చెబుతూ నాకు కాలేజ్ డేస్ లో ఉన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది అంటూ శేఖర్ కమ్ముల తెలిపాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ అలవాటు బాగా ఎక్కువైపోయింది. అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇదే శేఖర్ కమ్ముల రింగులు జుట్టు వెనుక ఉన్న రహస్యం.


అంచనాలతో కుబేర

ఇప్పటివరకు శేఖర్ కమ్ముల చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పుడు ధనుష్ తో చేస్తున్న కుబేర సినిమా దానిని మించి. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల ఇటువంటి సినిమాను హ్యాండిల్ చేయలేదు. అయితే ఈ సినిమా మీద కంప్లీట్ గా మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమాను సరస్వతి దేవి కూడా తలెత్తుకుని చూస్తుంది అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మామూలుగా ఇది శేఖర్ కమ్ముల వేరే సినిమా అంటున్నారు. ఈ సినిమాలకే వేరు అంటూ చెప్పడంతో ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు శేఖర్ కమ్ముల ఒక సినిమా గురించి ఇంతలా ఎలివేషన్ ఇవ్వలేదు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకులు ముందుకు రానుంది.

Also Read : Malavika Mohanan: ప్రభాస్ పై మనసు పారేసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ కు కొత్త వదిన దొరికేసినట్టే ?

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×