Tamannaah – Abdul Razzaq: టాలీవుడ్ ప్రముఖ సినీ నటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిన్నది తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన సత్తాను చాటుకుంటుంది. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు పరిచయమై 20 సంవత్సరాలకు పైనే అవుతున్న ఇప్పటికీ తన హవా ఏ మాత్రం తగ్గలేదు. హ్యాపీడేస్ సినిమాతో తమన్నా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ సినిమా అనంతరం వెను తిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలలో నటించి అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. తెలుగులో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. అక్కడ కూడా తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు, హిందీ, తమిళ్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ బిజీగా మారుతుంది. తమన్నా వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది. తమన్నా తనదైన నటనతో విపరీతంగా అభిమానులను సంపాదించుకుంటుంది. ఈ బ్యూటీకి విపరీతంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నది పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన లైక్స్ వస్తూ ఉంటాయి. ఇక తమన్నా వయసు మీద పడుతున్న ఇంతవరకు వివాహం చేసుకోవడం లేదు. కానీ కొంతమందితో లవ్ రిలేషన్ పెట్టుకుందని అనేక రకాల వార్తలు గతంలోనూ వచ్చాయి. అయితే ఆ వ్యక్తితో బ్రేకప్ అయ్యిందని తమన్నా ఓ సందర్భంగా వెల్లడించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రమే బయటికి చెప్పలేదు. ఈ క్రమంలోనే తమన్నా ప్రేమించింది పాకిస్తానీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అని తెలుస్తోంది. కొద్ది రోజులు పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారట. పాకిస్తానీ ప్రముఖ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా ప్రేమాయణం కొనసాగించిందని, డేటింగ్ కూడా చేసిందని అనేక రకాల వార్తలు తెరపైకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి క్లోజ్ గా తీసుకున్న కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Also Read: Maxwell: 13 సిక్సర్లతో మ్యాక్స్‌వెల్ భయంకరమైన సెంచరీ.. వాడో మోసగాడు అంటూ ప్రీతి జింటా ఫైర్ !
కానీ అది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టి పారేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉందని అనేక రకాల వార్తలు వచ్చాయి. దానికి తమన్నా సైతం ఓకే చెప్పింది. ఇద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటునట్లుగా తమన్నా అనేక సందర్భాలలో చెప్పింది. కానీ ఏమైందో తెలియదు గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడిపోయారని అనేక రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ వార్తలను తమన్నా ఇంతవరకు ఖండించలేదు. కానీ ఇన్ డైరెక్ట్ గా బ్రేకప్ అయినట్టుగా తమన్నా చెప్పుకొచ్చింది. మరి తమన్నా ఎవరిని వివాహం చేసుకుంటుందో చూడాలని తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తమన్న వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా గడుపుతుంది.