Malavika Mohanan: మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KU మోహనన్ నట వారసురాలిగా మాళవిక ఇండస్ట్రీకి పరిచయమైంది. మలయాళంలో పలు సినిమాల్లో నటించినా కూడా ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. ఇక ఆ సమయంలోనే కోలీవుడ్ లోవిజయ్ నటించిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా అమ్మడు ఛాన్స్ పట్టేసింది. ఇక ఈ సినిమా మాళవికను ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో నటించి మెప్పించిన మాళవిక తెలుగులో ది రాజా సాబ్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. మాళవిక ఎప్పుడైతే ఈ సినిమాలో ఉంది అని అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటినుంచి కూడా తెలుగు అభిమానులు ఆమెకు పట్టం కట్టేశారు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన టీజర్ లో మాళవిక అందాల ఆరబోతకు ఫాన్స్ ఫిదా అయ్యారు. ఎలాగైనా ఈ సినిమా మాళవికకు మంచి విజయాన్ని అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సినిమాల విషయం పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది అయితే అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించే మాళవిక తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది అభిమానులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి వారిని ఆనందపరిచింది. ఇక ఇందులో భాగంగా ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేసింది.
“ప్రభాస్ ను మొదటిసారి కలవడం నాకు చాలా స్పెషల్ మూమెంట్. అప్పటికే నేను వేరే షూటింగ్ లో చాలా అంటే చాలా అలసిపోయి ఉన్నాను. నిద్ర కూడా పోలేదు అలానే ప్రయాణం చేసి హైదరాబాద్ రావడంతో నీరసించి పోయాను. ఓపిక కూడా లేదు. ఇక అప్పుడే ప్రభాస్ ను మొదటిసారి చూశాను. ఆయనను చూడగానే నా అలసట మొత్తం పోయింది. వెంటనే యాక్టివ్ అయిపోయాను.తొలిచూపులోనే ప్రభాస్ నాకు నచ్చేసాడు. ఆయన ఎంతో అందంగా ఉన్నాడు. చాలా మాటకారి. ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడతాడు” అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్ మాటకారి, అనర్గళంగా మాట్లాడతాడు అన్న దగ్గరే ఏదో తేడా కొడుతోంది అని అభిమానులు సందేహిస్తున్నారు. అందుకు కారణం డార్లింగ్ ఇంట్రోవర్ట్ కాబట్టి. సాధారణంగా డార్లింగ్ ది చాలా చిన్న ప్రపంచం. అతి కొద్దీ మంది ఫ్రెండ్స్ తో తప్ప ఎక్కువ మాట్లాడాడు. అందులోనూ అమ్మాయిలతో అంటే నో ఛాన్స్. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెల్సిందే. అలాంటి ప్రభాస్.. మాళవికతో ఈ రేంజ్ లో మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అది కూడా సెట్ లో ఉన్నంతసేపు అమ్మడితోనే మాట్లాడాడు అంటే ఆలోచించాల్సిన విషయమే.
ఇప్పటివరకు డార్లింగ్ మొహమాటస్తుడు. తిండి పెట్టి చంపేస్తాడు అని చెప్పినవారే కానీ, ఇలా మాటకారి.. తెగ వాగేస్తాడు అని చెప్పిన మొదటి భామ మాళవికనే. నిజంగా డార్లింగ్ అంతలా మాళవికతో మాట్లాడాడా.. ? లేక ఏదో హైప్ కోసం ఈ చిన్నది అలా చెప్తుందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ప్రభాస్ గురించి ఈ రేంజ్ లో చెప్పడంతో ఫ్యాన్స్ అమ్మడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి ఈ సినిమాతో మాళవిక తెలుగులో పాతుకుపోతుందా.. ? లేక పక్కకు పోతుందా.. ? అనేది చూడాలి.