Sekhar Kammula : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొందరు లేని వెలితి అనేది ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అటువంటి వ్యక్తుల ప్రస్తావన వస్తే చాలా పేర్లు వినిపిస్తాయి. ముఖ్యంగా సాహిత్య రచయితల విషయానికి వస్తే వేటూరి సుందర రామమూర్తి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు సినిమా పరిశ్రమకు అందించారు. ఆయన సాహిత్యాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. చాలా అలవోకగా అర్థవంతమైన పాటలను రాయడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఇకపోతే ప్రస్తుత కాలంలో వేటూరి సుందర రామూర్తి పాటలను చాలామంది వింటున్నారు. కానీ ఆయనను చూసిన వాళ్ళు చాలా తక్కువ. ఇక వేటూరి సుందర రామమూర్తికి, శేఖర్ కమ్ములకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఆనంద్ తో మొదలైన బంధం
శేఖర్ కమ్ముల విషయానికి వస్తే వేటూరి సాహిత్యం ఆయనకు చాలా ఇష్టం. వేటూరి సుందర రామూర్తి తో పాట రాయించుకోవాలి అని శేఖర్ చాలా బలంగా కోరుకున్నారు. అయితే వేటూరి సుందర రామూర్తి చివరి దశలో ఉన్నప్పుడు ఆనంద్ సినిమా జరుగుతుంది. ఆ సినిమా పాటల కోసం శేఖర్ కమ్ముల వేటూరి దగ్గరికి వెళ్ళాడు. ఆ తరుణంలో వేటూరి పాటకు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే శేఖర్ తాను అంత ఇవ్వలేను కేవలం పాతికవేలు మాత్రమే ఇవ్వగలను అని చెప్పారు. అయితే అది కూడా ఒకేసారి ఇవ్వండి అని వేటూరి అడగడంతో అలానే ఇచ్చారు. అయితే పాతిక వేలు మాత్రమే ఇచ్చారు అని సాదాసీదా పాటను వేటూరి రాయలేదు. యమునా తీరం వంటి అద్భుతమైన పాటను శేఖర్ కమ్ములకు ఇచ్చారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
లీడర్ సినిమాలో అద్భుతమైన పాటలు
శేఖర్ కమ్ముల తీసిన కొన్ని సినిమాలలో లీడర్ సినిమాకి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ సినిమాలో కొన్ని పాటలు విపరీతంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. దానిలో ముఖ్యంగా “ఏ శకుని ఆడని చూద్దాం బతుకే ఒక చదరంగం” అనే పాటను వేటూరి రాసిన విధానం ఎప్పటికీ మర్చిపోలేము. అయితే కొందరు లేని లోటు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. అలా వేటూరి సుందర రామమూర్తి లోటు తెలుగు ప్రేక్షకులకు ఒక వెలితి అయితే, శేఖర్ కమ్ములకు వర్ణనాతీతమైన బాధ. అతని ఈరోజు ఉండుంటే కుబేర సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అని శేఖర్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా ఆయనను తలుచుకుని ఏడ్చిన సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి అని శేఖర్ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Sekhar Kammula: శేఖర్ కమ్ముల రింగులు జుట్టు వెనక స్టోరీ ఇదే