Nagachaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య(Nagachaitanyaa) తాజాగా నాగార్జున(Nagarjuna) డైరెక్టర్ శేఖర్ కమ్ములతో (Sekhar Kammula)కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా(Kubera Movie) మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాగార్జున ,శేఖర్ కమ్ముల ఇద్దరు కలిసి నాగచైతన్యతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అదేవిధంగా గత సినిమాల గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇకపోతే నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ”(Love Story) అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
లవ్ స్టోరీ…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ లవ్ స్టోరీ చిత్రం ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత తదుపరి నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం పలు సినిమాలలో నాగచైతన్య బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ ఎన్నో ఆశక్తికరమైన విషయాలను బయటపెట్టారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములను చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అతని వల్ల కొన్ని లక్షలు ఆదా చేశానని తెలిపారు.
డబ్బులు ఆదా…
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే బ్రాండ్ మైంటైన్ చేస్తూ ఉంటారు. వారు వేసుకునే బట్టల నుంచి మొదలుకొని ఉండే ఇల్లు, తిరిగే కార్లు తీసుకునే ఫుడ్ కూడా ఇలా ఎంతో ఖరీదైనవే ఉంటాయి. చాలావరకు సెలబ్రిటీలు ఇలాంటి వాటికే డబ్బులు అధికంగా ఖర్చు చేస్తారు. అయితే తాను కూడా లవ్ స్టోరీ సినిమాకు ముందు వరకు బ్రాండ్ అంటూ ఎన్నో డబ్బులు వేస్ట్ చేశానని కానీ ఒక్కసారిగా లవ్ స్టోరీ సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన తర్వాత శేఖర్ గ్యాంగ్ చూసి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని తెలిపారు.
సింపుల్ గా, సంతోషంగా బతుకుతున్నారు..
శేఖర్ కమ్ముల గారితో పాటు అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలా సింపుల్ ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయానని తెలిపారు. వీళ్లంతా ఇంత సింపుల్ గా ఉండి చాలా హ్యాపీగా బ్రతికేస్తున్నారు. ఇలా లవ్ స్టోరీ సినిమా సమయంలో మిమ్మల్ని అందరిని గమనించిన తర్వాత ఇలా సింపుల్గా హ్యాపీగా బ్రతికేయకుండా ఎందుకు మనకి ఇవన్నీ అని భావించాను. మీ వల్ల నాకు చాలా డబ్బులు మిగిలిపోయాయి అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య ఈ విషయాన్ని బయట పెట్టడంతో శేఖర్ కమ్ములతోపాటు నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం కుబేర సినిమా ద్వారా మీరు ప్రేక్షకులకు ఏ సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారో, మీతో పని చేసిన తర్వాత నాకు అది వర్తించిందని ఈ సందర్భంగా నాగచైతన్య తెలియజేశారు. ఇక కుబేర విషయానికి వస్తే ఈ చిత్రం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇందులో రష్మిక(Rashmika) ధనుష్(Danush) హీరో హీరోయిన్లుగా నటించగా నాగార్జున కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.
Also Read: Sekhar Kammula: పుష్ప2 సినిమాపై శేఖర్ కమ్ముల కామెంట్స్.. ఎంజాయ్ చెయ్యలేను అంటూ!