BigTV English

Curse of Rajabi: ఇరాన్‌ను వెంటాడుతోన్న ఆ యువతి శాపం? చేసిన పాపం ఊరికే పోదు!

Curse of Rajabi: ఇరాన్‌ను వెంటాడుతోన్న ఆ యువతి శాపం? చేసిన పాపం ఊరికే పోదు!

ఇజ్రాయెల్ యుద్ధంతో ఇరాన్ ఎంత నష్టపోతోందో మనందరికీ తెలుస్తూనే ఉంది. అది చాలదన్నట్టు పెద్దన్న అమెరికా కూడా ఇప్పుడు ఇరాన్ పై పగబట్టింది. అణ్వాయుధాల విషయంలో మంకుపట్టు పట్టిన ఇరాన్ నేడు సర్వనాశనం అయ్యేట్టుగా ఉంది. ఇది ఇరాన్ చేతులారా చేసుకున్నదే. ఇజ్రాయెల్ ని నాశనం చేసేందుకు వ్యూహాలు రచిస్తూ, చివరకు ఆ దేశం ధాటికి విలవిల్లాడిపోతోంది ఇరాన్. అణ్వాయుధ తయారీ కేంద్రాలు నేలమట్టం అయ్యాయి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది, రాజధాని నగరం నుంచి ప్రజలు వలసబాటపట్టారు. ఇంతకంటే ఇరాన్ ఇంకా దిగజారడానికి ఏముంది..? అయితే వీటన్నిటికీ కారణం ఓ 16 ఏళ్ల అమ్మాయి శాపం అంటే మీరు నమ్మగలరా..? ఆమె శాపం వల్లే ఇరాన్ చిక్కుల్లోపడిందని చెప్పలేం కానీ, అలాంటి యువతులు, మహిళల ఉసురు ఇరాన్ కి తగిలిందని ఒప్పుకోవాల్సిందే.


అతీఫ్ రజబి సహాలే
16 ఏళ్ల అతీఫ్ రజబి సహాలే అనే యువతికి ఇరాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2004 ఆగస్ట్-15న బహిరంగంగా క్రేన్ కి వేలాడదీసి ఆమెను ఉరివేశారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలిస్తే అందరూ షాకవుతారు. ఆమె అత్యంత దారుణంగా మానభంగానికి గురికాబడింది. ఇతర దేశాల్లో అయితే ఆమె ఒక బాధితురాలు, కానీ ముస్లిం దేశమైన ఇరాన్ లో, షరియా చట్టాల ప్రకారం ఆమె నేరస్తురాలు. తన కన్యత్వాన్ని కోల్పోయినందుకు ఆమెను దోషిగా చూసింది సమాజం, కోర్టు కూడా ఆమె వాదన వినకుండా నేరస్తురాలిగా తీర్మానించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కోర్టులోనే హిజాబ్ ని తొలగించి తన బాధను తెలిపింది రజబి. కానీ జడ్జి, ఆ ఘటనను మరింత పెద్ద తప్పుగా నిర్థారించారు. కోర్టు హాల్లో హిజాబ్ తొలగించి, న్యాయస్థానాన్ని ఆమె అవమాన పరిచిందని చెప్పారు. ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత రజబి చెప్పుతీసి జడ్జిపైకి విసిరేసింది. ఇంకేముంది అది కాస్తా మరణశిక్షగా మారింది. ఆమెను బహిరంగంగా ఉరితీశారు. ఒక బాధిత మహిళ తన బాధను చెప్పుకోడానికి కూడా కోర్టు అనుమతివ్వలేదు సరికదా ఆమెనే ఉరితీశారు. అదీ ఇరాన్ లో ఉన్న చట్టం, న్యాయం. అలాంటి దేశానికి ఆ యువతి శాపం తగలకుండా పోతుందా..? అందుకే ఇరాన్ నాశనం అవుతోందని అంటున్నారు నెటిజన్లు.

రజబి అసలు కథ ఇదే..


అసలు అతీఫ్ రజబి సహాలే కథ తెలుసుకుంటే మనసున్న ఏ ఒక్కరికీ కన్నీరాగదు. రజబికి ఐదేళ్లప్పుడే ఆమె తల్లి కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తర్వాత ఉన్న ఒక్కగానొక్క సోదరుడు నదిలో పడి చనిపోయాడు. అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది రజబి. అప్పుడామెకు 15 ఏళ్లు. కుటుంబ సభ్యులంతా ఇంటికి దూరంగా పనికి వెళ్లేవారు. ఆ ఇంటి పక్కనే ఉన్న 51 ఏళ్ల వ్యక్తి అలీ ఆమెపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న ఆమెను బలాత్కారం చేశాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని, కుటుంబ సభ్యుల్ని హతమారుస్తానని బెదిరించాడు. ఒకటీ రెండుసార్లు కాదు, కొన్ని వందలసార్లు ఆమెను శారీరకంగా హింసించాడు అలీ. చివరకు ఆమె ఈ వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. షరియా చట్టం ప్రకారం తెలియనివారి వల్ల కన్యత్వాన్ని పోగొట్టుకున్న మహిళ నేరస్తురాలు. ఆ నేరం కింద ఆమెనే జైలులో వేశారు.

షరియా చట్టం బాధితురాలు

జైలు జీవితం వల్ల అలీ అకృత్యాలనుంచి తప్పించుకోగలిగింది రజబి. కానీ.. అక్కడి పోలీస్ అధికారులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆమెను లైంగికంగా వేధించారు, పలుమార్లు అత్యాచారం చేశారు. జైలు సిబ్బందిలో ఎంతమంది, ఎన్నిసార్లు ఆమెపై లైంగిక దాడి చేశారో లెక్కే లేదు. 16 ఏళ్ల యువతి రజబి వారి హింసను తట్టుకోలేకపోయింది, జైలులో ఉన్న ఆమెను అమ్మమ్మ చూడటానికి వచ్చినప్పుడు ఆమె జీవచ్ఛవంలా కనపడేది. కాళ్లు వనికిపోయేవి, కనీసం నిలబడేందుకు కూడా ఆమె శరీరం సహకరించేది కాదు. ఎలాగోలా ఈ విషయం న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా ఆమెకు న్యాయం దక్కలేదు. ఆమెనే దోషిగా తీర్మానించారు జడ్జి హాజీ రెజాయ్. దీంతో ఆమె తన హిజాబ్ తొలగించి మరీ న్యాయం అర్థించారు. అది మరింత పెద్ద నేరం అని జడ్జి హుంకరించాడు. ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. దీంతో ఇక చేసేదేం లేక జడ్జిపైకి చెప్పు విసిరేసి తన కోపాన్ని ప్రదర్శించింది రజబి. అక్కడితో ఆమె జీవితం అయిపోయింది. కోర్టు తీర్పుతో ఆమెను బహిరంగంగా ఉరి తీశారు.

ఆమె శాపం..

ఆడవారి పట్ల అమానుషమైన ఇలాంటి చట్టాలు ఇరాన్ తో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లో కూడా అమలులో ఉన్నాయి. వేలాది మంది మహిళలు ఈ చట్టాల వల్ల తమ జీవితాలనే కోల్పోయారు, కోల్పోతూనే ఉన్నారు. రజబి ఉదంతం అంతర్జాతీయ మీడియా వల్ల వెలుగులోకి వచ్చింది. ఆమె శాపం, ఆమెలాంటి మరింతమంది బాధితుల శాపాల వల్లే ఇరాన్ కి నేడు ఈ దుస్థితి పట్టిందని అంటున్నారు.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×