BigTV English
Advertisement

Sekhar Kammula: పుష్ప2 సినిమాపై శేఖర్ కమ్ముల కామెంట్స్.. ఎంజాయ్ చెయ్యలేను అంటూ!

Sekhar Kammula: పుష్ప2 సినిమాపై శేఖర్ కమ్ముల కామెంట్స్.. ఎంజాయ్ చెయ్యలేను అంటూ!

Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula)త్వరలోనే కుబేర(Kubera Movie) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా అదే విధంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శేఖర్ కమ్ముల ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక శేఖర్ కమ్ముల సినిమాల విషయానికొస్తే ఈయన సినిమాలన్నీ ఇంటిల్లి పాది కూర్చుని చూసే విధంగా ఉంటాయని చెప్పాలి. చాలా మనసుకు ప్రశాంతత కలిగించే విధంగా శేఖర్ సినిమాలు ఉంటాయి.


బెగ్గర్ గా ధనుష్…

ఇకపోతే ఈసారి మాత్రం కుబేర సినిమా ద్వారా సరికొత్త జానర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని ఒక బిచ్చగాడికి ఒక బిలీనియర్ కి మధ్య జరిగే పోరాటం గురించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.. ఇక ఈ సినిమాలో హీరో ధనుష్ ఒక బెగ్గర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి. ఇంటర్వ్యూలో భాగంగా శేఖర్ కమ్ముల అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2)సినిమా గురించి మాట్లాడారు.


పుష్ప2..

ఇటీవల కాలంలో సినిమాలు కేవలం థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే అయితే కొన్ని సినిమాలు కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూస్తేనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. మరికొన్ని సినిమాలు ఇంట్లో కూర్చుని చూసిన మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తాను మాత్రం ఒక ఆహ్లాదకరమైన మనసుకు ప్రశాంతత నిచ్చే సినిమాలను ఇష్టపడతానని థియేటర్లకు వెళ్లి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టే సినిమాలను చూడటానికి ఇష్టపడనని తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఏవైనా చూశారా సలార్ కానీ, పుష్ప కానీ అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆ టాలెంట్ నాలో లేదు..

ఈ ప్రశ్నకు శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ తాను ఇటీవల పుష్ప 2 సినిమా చూడటం కోసం థియేటర్ కు వెళ్లాను కాని అక్కడ ఉండలేకపోయానని తెలిపారు. ఆ సినిమాని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అనే దానికంటే ఒక ఫిలిం మేకర్ గా నేను మాత్రం అలాంటి సినిమాలను చేయలేనని తెలిపారు. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం చాలా బాగా తీసారే అనిపించింది .కానీ ఆ సినిమాని చూస్తూ నేను ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపారు. అలాంటి సినిమాలు చేయాలి అంటే ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలని, ఆ టాలెంట్ నా దగ్గర లేదని శేఖర్ కమ్ముల తెలిపారు. ఇక మార్కెట్ పరంగా దేని విలువ దానికే ఉంటుందని ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాని మీరు చూడలేకపోయినా ప్రపంచం మొత్తం చూసిందంటూ బన్నీ ఫ్యాన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  గౌతమ్ ను చూసి నేర్చుకో పల్లవి ప్రశాంత్.. అడ్డంగా దొరికిపోయిన రైతు బిడ్డ

Related News

Peddi: చికిరి చికిరి సాంగ్ వచ్చేసిందోచ్.. లిరికల్ కాదు ఏకంగా వీడియోనే.

Katrina Kaif: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రీనా

IFFI 2025 : మలయాళ చిత్రానికి అరుదైన గౌరవం.. బెస్ట్ డైరెక్టర్ క్యాటగిరిలో సెలెక్ట్..

Gouri G Kishan: మీ బరువెంత అని అడిగిన జర్నలిస్ట్.. అందరి ముందు మండిపడ్డ జాను హీరోయిన్

SSMB 29: హమ్మయ్య.. నేటి నుంచీ వరుస అప్డేట్స్.. ఈ రోజు స్పెషల్ పోస్టర్ తో..

HBD Trivikram: చదువులో బంగారు పతకం.. ఉపాధ్యాయుడిగా కెరియర్.. కట్ చేస్తే!

Actress Death: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి.. ఎవరంటే?

Pan India Movies: బడా బడ్జెట్ చిత్రాలు.. బాక్స్ ఆఫీస్ అంచనాలు ఇవే!

Big Stories

×