Ravi Kishan: సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రవి కిషన్ (Ravi Kishan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవి కిషన్ అంటే పెద్దగా గుర్తుపట్టకపోయినా రేసుగుర్రం(Race Gurram) విలన్ మద్దాలి శివారెడ్డి అంటే మాత్రం కచ్చితంగా ఈయన అందరికీ గుర్తుకొస్తారు. రేసుగుర్రం సినిమాలో విలన్ పాత్రలో నటించి తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇలా తెలుగులో పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తే ప్రేక్షకులను మెప్పించిన రవి కిషన్ పెద్ద ఎత్తున బాలీవుడ్ సినిమాలతో పాటు, బోజ్ పురి సినిమాలలో కూడా నటిస్తూ గుర్తింపు పొందారు. ఇలా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల పట్ల కూడా ఎంతో ఆసక్తి కలిగి ఎంపీగా కూడా ఈయన బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
క్లిష్ట పరిస్థితులలో అండగా..
ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న రవి కిషన్ తాజాగా తనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక సమయంలో క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితులలో మన పక్కన నిలబడి మనకు సహాయం చేసే వారిని ఎప్పటికీ మరవకూడదని తెలిపారు. తన జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నా పక్కన నా భార్య నిలబడి నన్ను ఎంతగానో ప్రోత్సహించిందని వెల్లడించారు.
పాదాలను తాకడం..
ఈయన నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2(Son Of Sardaar 2) ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం కపిల్ శర్మ(Kapil Sharma) షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్ శర్మ రవికిషన్ కి సంబంధించిన ఈ విషయాన్ని బయట పెట్టారు. రవి కిషన్ ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో తన భార్య కాళ్లను తాకి నిద్రపోతారని ఈయన వెల్లడించారు. ఇక ఈ విషయం గురించి రవికిషన్ మాట్లాడుతూ..”అవును తాను ప్రతిరోజు తన భార్య పాదాలను తాకి నిద్రపోతాను అని తెలిపారు అయితే నేను నా భార్య పాదాలను తాకటం తనకు ఏమాత్రం నచ్చదు అందుకే తను నిద్రపోయిన తర్వాత ఆ పని చేస్తానని తెలిపారు”.
సన్ ఆఫ్ సర్దార్ 2…
నా భార్య ప్రీతి కిషన్(Preethi Kishan) నాకు పేరు, పలుకబడి, డబ్బు లేని సమయంలో కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ నా పక్కన నిలబడింది. నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తన భార్యఅని తెలిపారు. నాకోసం ఇంత చేసిన తనకు నేను ఏమి ఇవ్వగలను కనీసం తన పాదాలను తాకి ఇలా కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇలా కష్ట సమయంలో తన పక్కనే ఉంటూ తనని ప్రోత్సహించిన ఒక కారణంతోనే ప్రతిరోజు తన భార్య పాదాలను తాకడం అంటే గొప్ప విషయం అని చెప్పాలి. ప్రస్తుతం రవి కిషన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సన్ ఆఫ్ సర్దార్ 2 విషయానికి వస్తే.. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా జూలై 25వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఆగస్టు ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో రవి కిషన్ సైతం కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Salman Khan: రాముడిగా సల్మాన్ ఖాన్.. 40 శాతం షూటింగ్ పూర్తి.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు!