JioPC: ఏ కంపెనీ వస్తువులకైనా ఇండియా అతి పెద్ద మార్కెట్. ఇక్కడ నిలదొక్కుకుంటే వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. తాజాగా రిలయన్స్ జియో కొత్తగా జియోపీసీని రంగంలోకి దించింది. అయితే ఏంటి అనుకుంటున్నారా? దీనివల్ల నెలకు ఎంత ఆదా అవుతుందో తెలుసా?
రిలయన్స్ జియో మార్కెట్లోకి కొత్తగా జియో పీసీని ఇంట్రడ్యూస్ చేసింది. దీనివల్ల టీవీని పీసీగా మార్చుకోవచ్చు. JioPC గా పిలువబడే ఇది వినియోగదారులకు ప్రత్యేక సీపీయూ-CPU అవసరం లేదు. నేరుగా కంప్యూటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఈ సర్వీసు ఏఐ క్లౌడ్‌లో Jio సెట్-టాప్ బాక్స్ ద్వారా పని చేస్తుంది.
కనెక్ట్ చేయబడిన టీవీని పర్సనల్ కంప్యూటర్‌గా మార్చుకోవచ్చు. అంటే టూ ఇన్ వన్ అన్నమాట. ఎలాంటి లాక్ ఇన్, జీరో-మెయింటెనెన్స్ అన్నమాట. భారతదేశంలోని కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి మొట్టమొదటి AI- రెడీ క్లౌడ్ కంప్యూటర్ ఇది. ‘పే యాజ్ యు గో’ మోడల్‌తో తీసుకొచ్చింది.
జియో సెట్-టాప్ బాక్స్, కీబోర్డ్, మౌస్, స్క్రీన్ ఉపయోగించి ఎక్కడి నుండైనా ఉపయోగించుకోవచ్చు. రిపేర్, హార్డ్‌వేర్ లేకుండా అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. ముఖ్యంగా విద్యార్థులు, నిపుణులు, చిన్న వ్యాపారాలు ఉపయోగకరంగా ఉంటుంది.
ALSO READ: మిడ్ రేంజ్‌లో గేమింగ్.. మల్టీ టాస్కింగ్ అన్నీ, మార్కెట్లో రెండు కొత్త ఫోన్లు హల్‌చల్
JioFiber లేదా Jio Air Fiber కనెక్షన్ ఉన్న వినియోగదారులు Jio-PCని ఉపయోగించడానికి అదనపు నెలవారీ ప్లాన్ తీసుకోవాలి. కొత్త వినియోగదారులు ఈ సేవను ఓ నెల పాటు ఉచితంగా ఉపయోగించ వచ్చు. దీనికి నిర్వహణ, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు అవసరం లేదు. Adobeతో JioPC భాగస్వామ్యం కుదుర్చుకుంది.
వినియోగదారులకు ప్రపంచ స్థాయి డిజైన్, ఎడిటింగ్ సాధనాలను ఉచితంగా పొందవచ్చు. ఇందులో అన్ని కీలకమైన AI టూల్స్ ఉపయోగించుకోవచ్చు. కేవలం అప్లికేషన్లు మాత్రమేకాదు 512 GB క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. ఈ సేవ కోసం కంపెనీ ఎటువంటి లాక్-ఇన్ వ్యవధిని నిర్ణయించలేదు.
పైగా క్లౌడ్ ఆధారిత జియో-పీసీ చాలా శక్తివంతమైనదని ఆ కంపెనీ మాట. ప్రాసెసింగ్ పవర్ గొప్పగా ఉండనుంది. రోజువారీ వాడకంతోపాటు గేమింగ్-గ్రాఫిక్ రెండరింగ్ వంటి హై-ఎండ్ పనులను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులు ముందస్తు పెట్టుబడి లేకుండా 50 వేల విలువైన PC ఫీచర్లను పొందవచ్చని Jio తెలిపింది.
JioPCకి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఇలా ఉన్నాయి.
రూ. 599 + GSTతో అపరిమిత వినియోగంతో నెల పాటు చెల్లుబాటు అవుతుంది.
రూ. 999 + GSTతో అపరిమిత వినియోగంతో రెండు నెలలు చెల్లుబాటు అవుతుంది.
రూ. 1,499 + GSTతో ఒక నెల అదనంగా నాలుగు నెలలు వినియోగించుకోవచ్చు.
రూ. 2,499 + GSTతో మొత్తం ఎనిమిది నెలల అపరిమిత వినియోగించుకోవచ్చు.
రూ. 4,599 + GSTతో మొత్తం 15 నెలల అపరిమిత వినియోగించుకోవచ్చు.