Naga Vamsi: మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతం. సుమంత్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ లో జెర్సీ అనే సినిమాను చేశాడు. నాని నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అలానే ఆ బ్యానర్ కి ఒక గౌరవం తెచ్చింది. సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా గౌతమ్ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. మూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ జరగలేదు. అదే ప్రాజెక్టును విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దానిపైన నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.
రామ్ చరణ్ కథను విజయ్ చేశాడా.?
రామ్ చరణ్ చేయవలసిన కథను విజయ్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే దీని గురించి ఎప్పుడూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. రేపు సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో నేడు ప్రెస్ మీట్ లో నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. నాగ వంశీ మాట్లాడుతూ.. నేను కథ రెడీ చేశాను ఇది విజయ్ కి అయితే బాగుంటుంది అని చెప్పాడు. వెంటనే మేము విజయ్ దేవరకొండను ఈ సినిమా కోసం అడిగాము. వేరే ఆప్షన్స్ కూడా తీసుకోలేదు అంటూ నాగవం నుంచి క్లారిటీ ఇచ్చాడు. అలానే మరో 15 రోజుల్లో వార్ 2 సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగు రోజులు దాని గురించి ఏమీ మాట్లాడను అంటూ తెలిపాడు. మండే నుంచి ఆ సినిమా ఈవెంట్ గురించి మిగతా వాటి గురించి మాట్లాడుతాను అంటూ చెప్పారు.
వాళ్ల గురించి అసలు రెస్పాండ్ అవ్వను
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగ వంశీ పిఆర్ఓస్ గురించి కామెంట్స్ చేశారు. పిఆర్ఓస్ ఏకంగా బెదిరిస్తున్నారు అంటూ మాట్లాడారు. దీనిపైన కొంతమంది పి.ఆర్.ఓస్ ఫీలయ్యారు. వాళ్లకి ఏమైనా క్లారిటీ ఇస్తారా అని ఒక జర్నలిస్ట్ అడిగితే. నేను ఈవెంట్ లో కింగ్డమ్ గురించి తప్ప దేని గురించి మాట్లాడుదల్చుకోలేదు. దేనికి క్లారిటీ ఇవ్వను అంటూ రెస్పాండ్ అయ్యాడు నాగ వంశీ. అలానే ఈ సినిమా రేపు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు రోజు ప్రీమియర్స్ వేయడం అనవసరం అనిపించి వేయలేదు అంటూ తెలిపారు.
Also Read: Vijay Devarakonda: నన్ను ఎంకరేజ్ చేయమని వాళ్లను అడిగేవాడిని