BigTV English

Nagavamsi: నీకెంత కావాలో చెప్పు… కలెక్షన్స్ పోస్టర్లపై నాగ వంశీ కామెంట్స్!

Nagavamsi: నీకెంత కావాలో చెప్పు… కలెక్షన్స్ పోస్టర్లపై నాగ వంశీ కామెంట్స్!

Nagavamsi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ (Nagavamsi)ఒకరు. ఈయన నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను నాగవంశీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన నిర్మించిన కింగ్ డం (King Dom)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జులై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.


కలెక్షన్లు ఎంతైనా వెయ్యొచ్చు..

ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీకి రిపోర్టర్స్ నుంచి కలెక్షన్ల(Collections) పట్ల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు విడుదల చేస్తున్నట్లు స్వయంగా నిర్మాతలే పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక తాజాగా నాగ వంశీ కూడా సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ , ప్రీమియర్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మంచి ఆదరణ లభిస్తుంది. మరి మొదటి రోజు ఈ సినిమాకు ఎంత మొత్తంలో కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్న ఎదురయింది.


అడ్వాన్స్ బుకింగ్స్ లో పాస్ అయ్యాను..

ఈ ప్రశ్నకు నాగ వంశీ సమాధానం చెబుతూ నేను అడ్వాన్స్ బుకింగ్ విషయంలో పాస్ అయ్యానని తెలిపారు. ఈ సినిమాకు అనుకున్న విధంగానే అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయని అయితే మొదటి రోజు కలెక్షన్ల గురించి చెప్పడానికి ఏముంది లేండి మీకు ఎంత ఫిగర్ కావాలో చెప్పండి, పోస్టర్ వేసేద్దాం అంటూ ఈ సందర్భంగా నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో సినిమాపై బజ్ క్రియేట్ చేయడం కోసమే నిర్మాతలు ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు విడుదల చేస్తున్నారని ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్లు వెల్లడించారు.

విజయ్ దేవరకొండ ఫస్ట్ ఛాయిస్..

ఈ క్రమంలోనే నాగ వంశి కూడా కలెక్షన్లది ఏముంది చెప్పండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. ఇక ఈ సినిమాకు మొదట విజయ్ దేవరకొండని అనుకున్నారా? లేదంటే మరే హీరోనైనా సంప్రదించారా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నాగ వంశీ సమాధానం చెబుతూ ముందుగా గౌతమ్ తన వద్దకు వచ్చి విజయ్ దేవరకొండ కోసం ఇలాంటి కథ అనుకున్నాను అంటూ ఆయనే మొదట విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. ఇక మేము కూడా విజయ్ దేవరకొండనే సెలెక్ట్ చేశామని ఈ కథకు ముందుగా ఎవరిని అనుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి 31వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Vijay Devarakonda: కింగ్ డం విడుదల వేళ.. విజయ్ ఆసక్తికర పోస్ట్.. ప్రశాంతంగా ఉన్నానంటూ!

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×