Beetroot Juice For Heart: ఈ రోజుల్లో గుండె జబ్బులు ఒక సాధారణ సమస్యగా మారాయి. అయితే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకమైన ఆహారం దీనిని నివారించడంలో సహాయపడతాయి. సులభంగా లభించే బీట్‌రూట్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా ఇది గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. వివిధ రకాల వ్యాధులు కూడా నివారించడంలో కూడా మేలు చేస్తుంది.
బీట్‌రూట్‌లో పోషకాలు అధికం:
బీట్‌రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇందులో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఈ రసాయనం రక్త నాళాలను విస్తరించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తరచుగా బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె జబ్బుల లక్షణాలను తగ్గించి, ఆరోగ్యకరమైన గుండెను కూడా కాపాడుకోవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్ యొక్క ప్రయోజనాలు:
అధిక రక్తపోటు:
బీట్‌రూట్ జ్యూస్‌లో అధిక నైట్రేట్ కంటెంట్ ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
గుండె జబ్బులు:
రోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇందులో రక్త నాళాలను సడలించే, రక్త ప్రసరణను మెరుగుపరిచే నైట్రేట్లు కూడా ఉంటాయి.
అథెరోస్క్లెరోసిస్:
రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోతే బీట్‌రూట్ రసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నాళాలను మరింత సరళంగా చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.
గుండె వైఫల్యం:
బీట్‌రూట్ జ్యూస్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గుండెపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఆంజినా:
బీట్‌రూట్ జ్యూస్ ఛాతీ నొప్పి (ఆంజినా) నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండెకు తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. అంతే కాకుండా ఇది నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.
Also Read: నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. మతిపోయే లాభాలు !
బీట్‌రూట్‌ను ఎలా తినాలి ?
1. తాజాగా తయారుచేసిన బీట్‌రూట్ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
2. ఉత్తమ ఫలితాల కోసం, ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తీసుకోండి. తద్వారా పోషకాలు త్వరగా ప్రభావం చూపుతాయి.
3. బీట్‌రూట్‌ను పచ్చిగా కూడా తినవచ్చు. ఇది కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటుంది.
బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసుకునే విధానం:
బీట్‌రూట్ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం. బీట్‌రూట్‌ను బాగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత బ్లెండర్‌లో వేసి నీటితో బాగా కలపండి. రుచి కోసం మీరు నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు.