E-Paper
Advertisement

నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్.. ఇంత హైప్ అవసరమా బాబోయ్!

నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్.. ఇంత హైప్ అవసరమా బాబోయ్!
Advertisement

Naga Vamsi:సితారా ఎంటర్ టైన్ మెంట్స్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందరు వెయిట్ చేసేది నాగ వంశీ ఏం మాట్లాడుతాడా అని. ఆయన గారికున్న స్పీచులకి అలాంటి డిమాండ్ ఉంటుంది మరి.

సినిమాలపై ఒక రేంజ్ లో అంచనాలు పెంచేయడం, తీరా చూస్తె సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో చాలా సార్లు మీమర్స్ కి మాంచి స్టఫ్ అయ్యారు. అయితే ఎన్ని సార్లు ఎంతమంది ట్రోల్ చేసినా ఎక్కడా తగ్గకుండా రిలీజ్ అయ్యే ప్రతీ సినిమా గురించి కూడా అదే రేంజ్ లో అంచనాలు పెంచేయడం, ఓవర్ హైప్ క్రియేట్ చేయడం నాగ వంశీకే సొంతం.

విశ్వనాథ్ & సన్స్‌కు కూడా ఓవర్ హైప్!

Advertisement

ఇక తాజాగా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతున్న విశ్వనాథన్ అండ్ సన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే రేంజ్ లో హైప్ పెంచేశాడు నాగ వంశీ.సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు.. కానీ అప్పుడే ‘అల వైకుంఠపురములో’,‘అత్తారింటికి దారేది’, త్రివిక్రమ్ సర్టిఫికెట్.. ఇలా సినిమాకి ఎంత బూస్టప్ ఇవ్వాలో అంతా ఇచ్చే పనిలో పడ్డాడు.

ఇక ఈయన గారి స్పీచ్ చూశాకా ఇంకాస్త వదిలితే సినిమా రివ్యూ కూడా చెప్పెస్తాడేమో అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.

“సినిమా చాలా బాగుంటుంది”.. గట్టిగానే చెప్పేశాడు!

Advertisement

నాగ వంశీ మాట్లాడుతూ “చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద ఇంత ధైర్యంగా చెబుతున్నాను.. సినిమా చాలా బాగుంటుంది” అంటూ ఓవర్ హైప్ ఇచ్చేశాడు.సాధారణంగా నిర్మాతలు సినిమా బాగుంటుందని చెబుతారు. కానీ ఇక్కడ మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే.. మరీ ఇంత ఓవర్ హైప్ అవసరమా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్‌తో సూర్యను పోల్చేశాడు!

ఇక్కడ ఇంకో హైలెట్ ఏంటంటే సూర్య క్యారెక్టర్‌ను ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ పాత్రతో పోల్చడం.పవన్‌ను ఆ సినిమాలో చూస్తే ఎలాంటి కిక్ వస్తుందో.. సూర్యను ఈ సినిమాలో చూస్తే కూడా అలాంటి కిక్ వస్తుందట. అంటే ఆడియన్స్ సినిమా థియేటర్ కి వెళ్ళేటప్పుడు ‘అత్తారింటికి దారేది’ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లాలన్న మాట.

త్రివిక్రమ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు!

ఇక త్రివిక్రమ్ కి ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసిందని, తమ బ్యానర్‌లో త్రివిక్రమ్‌కు నచ్చిన సినిమా ఏదీ ఫెయిల్ కాలేదని చెప్పుకొచ్చాడు.పైగా “సినిమాలో సూర్య తప్ప ఇంకెవరూ కనిపించలేదు” అని త్రివిక్రమ్ అన్నారట. ఇది విన్న సూర్య అభిమానులు ఆనందపడాల్సిందే.

మరి నిజంగానే ఈ హైప్ అంతా సినిమాకి ప్లస్ అవుతుందా.. లేక తర్వాత “అయ్యో ఇలా ఎందుకు చెప్పామా” అని నాలుక కర్చుకునే పరిస్థితి వస్తుందా అనేది చూడాలి.

‘అల వైకుంఠపురములో’తో పోలిక!

ఇంతటితో నాగవంశీ గారి హైప్ ఆగలేదండోయ్. ఈ మధ్యే కోయంబత్తూరులో జరిగిన ఆడియో ఈవెంట్‌లో ‘విశ్వనాథ్ & సన్స్’ తమిళంలో ‘అల వైకుంఠపురములో’ అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.“అలా పోల్చుతున్నానని అహంకారం అనుకోవద్దు.. మాకు సినిమాపై అంత నమ్మకం ఉంది” అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

అంటే ‘అల వైకుంఠపురములో’ హిట్ రేంజ్ ఒక వైపు.. ‘అత్తారింటికి దారేది’ కిక్ మరో వైపు.. మధ్యలో త్రివిక్రమ్ సర్టిఫికెట్. ఇక మిగిలింది ఆగస్టు 14న థియేటర్‌లో సినిమా చూపించడమే అన్న మాట.

తల్లీకొడుకుల బంధం చుట్టూ కథ!

అయితే కథ పరంగా చూస్తే ‘విశ్వనాథ్ & సన్స్’ తల్లీకొడుకుల బంధం చుట్టూ తిరిగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది.అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుందని నాగవంశీ చెబుతున్నారు. అంటే సినిమా చూసి బయటకు వచ్చాక అమ్మకు ఫోన్ చేసి “అమ్మా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం” అని చెప్పేలా చేస్తారా?

అదే నిజమైతే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టే అవకాశం పుష్కలంగా ఉంది.

వెంకీ అట్లూరి ఏం చేశాడో చూడాలి!

వెంకీ అట్లూరి గతంలో ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘సార్’ వంటి సినిమాలతో తన మార్క్ చూపించాడు. ఈసారి సూర్య లాంటి స్టార్ హీరోతో ఫ్యామిలీ ఎమోషన్‌ను ఎలా డీల్ చేశాడో చూడాలి.

also read :లాంగ్ హెయిర్.. స్లిమ్ లుక్.. ‘RC17’లో చరణ్ కొత్త అవతార్!

హైప్ అంతా పక్కన పెడితే..

మొత్తానికి సినిమా రిలీజ్‌కు ముందే నాగవంశీ గారు సినిమాకు రివ్యూ, రేటింగ్, కంపారిజన్, సర్టిఫికెట్.. అన్నీ ప్యాకేజ్‌లో ఇస్తున్నట్టే ఉంది.ఇప్పుడు ప్రేక్షకులకు మిగిలింది ఒక్కటే.. ఆగస్టు 14న థియేటర్‌కు వెళ్లి “నాగవంశీ గారు చెప్పింది నిజమేనా?” అన్నది బాక్సాఫీస్ వద్దనే తేలాలి.

ఎందుకంటే హైప్‌తో సినిమా ఓపెనింగ్ తీసుకురావచ్చు.. కానీ రెండో రోజు నుంచి ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టేది మాత్రం సినిమా మ్యాటర్ మాత్రమే!

Tags

Related News

‘ఇరుముడి’ ట్రైలర్.. రూటు మార్చిన రవితేజ, ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదుగా!

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకున్న బ్యూటీస్!

లాంగ్ హెయిర్.. స్లిమ్ లుక్.. ‘RC17’లో చరణ్ కొత్త అవతార్!

వామ్మో, ఎన్టీఆర్ కోలుకోడానికి అంత టైమ్ పడుతుందా? డాక్టర్లు ఏం చెప్పారంటే?

‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా?.. వీడియో చూస్తే షాకే!

కిమ్స్ హాస్పిటల్ లో జూ.ఎన్టీఆర్ కి శస్త్ర చికిత్స!

అగ్నివీర్ గా టాలీవుడ్ విలన్ కూతురు!

Big Stories

Advertisement
×