Basit Ali On IND VS PAK Asian Games Final: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) మధ్య అక్టోబర్ మూడో తేదీన ఫైనల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావాలని పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ ఆలీ (basit ali) సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే గోల్డ్ మెడల్ ఇరు జట్లు పంచుకోవచ్చు అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. జపాన్ లో ఇప్పుడు విపరీతంగా వర్షాలు పడుతున్నాయని.. ఫైనల్స్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందని అంచనా వేశారు.
క్వార్టర్ ఫైనల్స్ తరహాలోనే వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే, సంతోషమని వ్యాఖ్యానించారు. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే గోల్డ్ మెడల్ రెండు జట్లు పంచుకోవడం చూడాలని ఆశగా ఉందని తెలిపారు. గతంలో కూడా ఫైనల్స్ రద్దు అయితే గోల్డ్ మెడల్ పంచుకున్న సందర్భాలు గుర్తు చేశారు. మ్యాచ్ ఇండియా తో జరిగితే పాకిస్తాన్ గెలవడం కష్టమైనని.. దానికంటే వర్షం పడి మ్యాచ్ రద్దు కావడమే బెటర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్ దాకా టీమిండియా చేరుకుంది. అటు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్న వర్షం కారణంగా టీమ్ ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయింది. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ దశలో వర్షం పడి మ్యాచ్ లు రద్దు అయితే… ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం విజేతలను ఖరారు చేస్తారు. కానీ ఆసియా క్రీడాలు 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో అలా ఉండదు. ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారితే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తారు. అది కూడా కుదరకపోతే ఇది జట్లను విజేతలుగా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అప్పుడు ఇండియాతో పాటు పాకిస్తాన్ గోల్డ్ మెడల్ పంచుకోవాల్సి ఉంటుంది.
2023 ఏషియన్ గేమ్స్ ఫైనల్స్ సందర్భంగా ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో గోల్డ్ మెడల్ ఇరు జట్లు పంచుకున్నాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి వస్తుంది.